ఆంధ్రప్రదేశ్‌

సమ్మెలో స్వచ్ఛందంగా 90శాతం లారీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 20: డిమాండ్‌ల సాధన నిమిత్తం ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా లారీ యజమానులు చేపట్టిన నిరవధిక సమ్మె తొలిరోజు శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతమైంది. దాదాపు మూడున్నర లక్షల లారీలు, ట్యాంకర్‌లు, మినీలారీలు, ఇతర రవాణా వాహనాలు ఉండగా అందులో 90శాతం సమ్మెలో పాల్గొన్నాయి. లారీల సమ్మెతో జాతీయ రహదారులు వెలవెలపోతూ కన్పించాయి. ఇక యజమానులు లారీలను ఆటోనగర్‌లకు తరలించి మరమ్మతులు చేయించుకోటంలో నిమగ్నమయ్యారు. సమ్మెలో భాగంగా విజయవాడలో లారీ యజమానులు ఉదయం బెంజిసర్కిల్ వద్ద ధర్నా నిర్వహించగా కొంతసేపు అన్ని రకాల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది. ఆదాయపు పన్ను సెక్షన్ 44ఏఇ, టీడీఎస్ మినహాయింపు రద్దు చేయాలని, ఈ-వేబిల్లుల సమస్యలు పరిష్కరించాలని, నేషనల్ పర్మిట్ లారీలకు డబుల్ డ్రైవర్ విధానాన్ని తొలగించాలని ముఖ్యంగా ఏపీలో డీజిల్‌పై పెంచిన 4 రూపాయల పన్నును వెంటనే తొలగించాలని, తెలుగు రాష్ట్రాల మధ్య కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు ఇవ్వలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోనేరు వెంకటరామరావు, అడుసుమిల్లి సదాశివరావులు మాట్లాడుతూ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న రవాణా రంగం సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు తమ సమ్మె కొనసాగుతుందన్నారు. జీవన్మరణ పరిస్థితుల్లో గత్యంతరం లేక సమ్మెలోకి దిగాల్సి వచ్చిందన్నారు.