ఆంధ్రప్రదేశ్‌

తూ.గో. ఏజెన్సీలో వాగులో చిక్కుకున్న తండ్రీ కుమార్తెలను రక్షించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, జూలై 20: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో మోటారు బైకుతోపాటు కొట్టుకుపోతున్న తండ్రీ కుమార్తెలను గ్రామస్థుల సహాయంతో పోలీసులు రక్షించారు. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి మండలంలోని చినఏరు నెల్లిమెట్ల సమీపంలో రహదారిపై ఉద్ధృతంగా ప్రవహించసాగింది. కాగా జిల్లా కేంద్రం కాకినాడ నుంచి లాగరాయి గ్రామంలో ఒక శుభకార్యం నిమిత్తం ముగ్గురు కుటుంబ సభ్యులు బైకుపై వచ్చారు. మార్గమధ్యంలో వాగు ప్రవాహాన్ని చూసి భార్య బైకు దిగిపోగా, భర్త, కుమార్తె వాగు దాటడానికి ప్రయత్నించారు. అయితే మధ్యలోకి వెళ్లే సరికి వరద ప్రవాహం మరింత పెరగడంతో బైకుతో సహా ఇరువురూ కొట్టుకుపోసాగారు. కళ్ల ముందే భర్త, కుమార్తె ప్రమాదంలో చిక్కుకోవడంతో వారిని రక్షించడానికి భార్య కూడా వాగులోకి వెళ్లే ప్రయత్నం చేసింది. అయితే అప్పుడే అక్కడికి విధి నిర్వహణకు చేరుకున్న హెడ్ కానిస్టేబుల్ సువర్ణబాబు, కానిస్టేబుల్ పెద్దబ్బాయి నీటిలోకి వెళ్లకుండా ఆమెను వారించారు. గ్రామస్థుల సహాయంతో పోలీసులు వాగులోకి దిగి కొమ్మలు పట్టుకుని వేలాడుతున్న తండ్రి, కుమార్తెలను తాళ్ల సహాయంతో బయటకు తీసుకువచ్చారు. వాగు ఉద్ధృతి తగ్గిన తరువాత బైకును కూడా బయటకు తీశారు.