ఆంధ్రప్రదేశ్‌

అనధికార లే-అవుట్లపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 11: రియల్ మాఫియా ఆగడాలపై గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (గుడా) ఎట్టకేలకు ఉక్కుపాదం మోపింది. తూర్పు గోదావరి జిల్లాలో నిబంధనలకు పూర్తి విరుద్ధంగా వేసిన అనధికార లే-అవుట్లపై గుడా అధికారులు గురువారం నుంచి ప్రత్యక్ష చర్యలకు నడుంబిగించారు. అనధికార లే-అవుట్ల ఏర్పాట్లు, క్రయ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ ఇంతవరకూ హెచ్చరించిన గుడా పాలకవర్గం ఇపుడు నేరుగా అనధికార లే-అవుట్లపై చర్యలకు సిద్ధమయ్యింది. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప మండలంలో పలు లే-అవుట్లపై గుడా ప్రణాళికాధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. డి భావరం, గురజనాపల్లి, నడకుదురు, పెనుగుదురు, కోరుపల్లి తదితర గ్రామాల్లో పలు అనధికార లే అవుట్లను గుర్తించారు. కాకినాడ నగరానికి చేరువలో ఉన్న ఈ గ్రామాల్లో ఇటీవలి కాలంలో లెక్కకు మిక్కిలి లే అవుట్లు వేశారు. ఆయా గ్రామాల పరిధిలో సుమారు 6 లే అవుట్లకు ఏ విధమైన అనుమతులు లేనట్టు గుర్తించారు. దీంతో సదరు లే అవుట్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. ఈ లే అవుట్లలో స్థలాలు కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరమని, చట్టవిరుద్ధంగా ఏర్పాటుచేసిన లే అవుట్లలో భవన నిర్మాణాలకు ఏ విధమైన అనుమతులు మంజూరుచేసేది లేదని హెచ్చరిక బోర్డులో గుడా స్పష్టం చేసింది. ఈ తనిఖీలో కొన్ని లే అవుట్లకు గుడా అనుమతులున్నట్టు అధికారులు గుర్తించారు.
దీనిపై గుడా ఇన్‌ఛార్జి సిటీ ప్లానర్ ఏ సత్యమూర్తి మాట్లాడుతూ గుడా నుండి అనుమతి లేకుండా సిద్ధం చేసిన అనధికార లే-అవుట్లపై ఇకనుంచి నిరంతరాయంగా దాడులు నిర్వహిస్తామని చెప్పారు. అక్రమ లే అవుట్లు వేసిన వారే కాకుండా సదరు లే-అవుట్లలో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయడం కూడా చట్టవిరుద్ధమేనని, ఈ వాస్తవాన్ని గ్రహించాలని ప్రజలకు ఆయన సూచించారు.
ఇదిలావుండగా కాకినాడ నగరానికి చేరువలో గత రెండేళ్లలో అనధికార లే అవుట్లు వందల సంఖ్యలో ఏర్పాటయ్యాయి. విచిత్రం ఏమిటంటే గుడా ఏర్పాటయ్యాక అక్రమ లే అవుట్ల ఏర్పాటు మరింత పెరిగింది. గుడా విధించిన నిబంధనల ప్రకారం లే-అవుట్లు వేస్తే అధిక లాభాలు వచ్చే అవకాశం లేక రియల్ మాఫియా అనధికార లే-అవుట్లతో కాసులు గడిస్తోంది. కాకినాడకు చేరువలో ఉన్న మండలాల్లో వేసిన అనధికార వెంచర్లకు అధిక డిమాండ్ ఉంది. కరప, కాకినాడ రూరల్, సామర్లకోట, పెద్దాపురం ఏడీబీ రోడ్డు ఏరియాల్లో అనధికార లే అవుట్లు రాజ్యమేలుతున్నాయి. అలాగే బిక్కవోలు, రంగంపేట, రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్ మండలాల పరిధిలో ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున చట్టవిరుద్ధంగా లే అవుట్లు వేసినట్టు గుడా అధికారుల పరిశీలనలో వెల్లడైనట్టు సమాచారం! ఈ నేపథ్యంలో అనధికార లే అవుట్లపై గుడా అధికారుల మెరుపు దాడులు కొనసాగే అవకాశం ఉంది.