ఆంధ్రప్రదేశ్‌

అవిశ్వాస తీర్మానానికి రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 20: అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తగా... వివిధ రూపాల్లో అవిశ్వాసానికి మద్దతు వ్యక్తమయింది. ఈ సందర్భంగా దేవాలయాల్లో పూజలు, మానవహారాలు, ధర్నాలు, ప్రదర్శనలు, ప్లెక్సీలు, కాగడాల ప్రదర్శనలు హోరెత్తాయి. అత్యధిక ప్రజలు టీవీలకే అతుక్కుపోయారు. విజయవాడ నగరంలో రాత్రి తెలుగుదేశం ఆధ్వర్యంలో మున్సిపల్ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు కాగడాల ప్రదర్శన జరిగింది. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పార్లమెంట్‌లో ఆంధ్రుల వాణిని వినిపించేందుకు తగిన సమయం ఇవ్వకపోవడం తీరని అన్యాయమని అన్నారు. ప్రత్యేకహోదా... విభజన చట్టంలోని హామీలు అమలయ్యే వరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు. పార్లమెంట్‌లో మంది బలానికి, నైతిక బలానికి మధ్య జరుగుతున్న పోరాటమని అన్నారు. మోదీ కళ్లు తెరిపించేంత వరకు తమ ధర్మా పోరాటం కొనసాగుతుందన్నారు. టీడీపీ ఎంపీలు ఢిల్లీలో పోరాడుతుంటే ప్రతిపక్షనేత జగన్ కోర్టులు, వైకాపా ఎమ్మెల్యేలు తమ ఇళ్లల్లో పడుకున్నారని అంటూ ఎద్దేవా చేశారు. ఆర్టీసీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మాట్లాడుతూ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుంటే జగన్ కోర్టులో ఉంటే ఇక పవన్‌కల్యాణ్ ఎక్కడదాక్కున్నాడో అర్థం కావడం లేదన్నారు. శాసనమండలిలో ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న మాట్లాడుతూ ఇప్పటివరకు దేశ చరిత్రలో ప్రధానిని గద్దె దింపడానికి అవిశ్వాసం పెట్టారు కానీ, నేడు ప్రజల కోసం అవిశ్వాసం పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామమోహన్, మహిళ కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
పార్లమెంటుపై విశ్వాసం
కోల్పోయేలా బీజేపీ వైఖరి: మంత్రి నక్కా
గుంటూరులో జరిగిన కాగడాల ప్రదర్శనలో మంత్రి నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన పాపంలో కాంగ్రెస్ మొదటి ముద్దాయి అయితే, రెండో ముద్దాయి బీజేపీయే అన్నారు. పార్లమెంటుపై ఉన్న విశ్వాసాన్ని ప్రజలు కోల్పోయే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం ఎంపీలు పార్లమెంటులో గళం విప్పుతుంటే ప్రతిపక్ష నేత జగన్ హోదాపై మాట్లాడకుండా తప్పించుకు తిరుగుతున్నారన్నారు.
కాంగ్రెస్ మానవహారాలు
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరారెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు నిర్వహించారు. ఇక సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని గుంటూరు, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, కర్నూలు, విజయవాడ, పలుప్రాంతాల్లో ధర్నాలు నిర్వహించారు.