ఆంధ్రప్రదేశ్‌

లా వర్సిటీ ఎదుట డీటైన్ విద్యార్థుల బైఠాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, జూలై 20: విశాఖ జిల్లా సబ్బవరం దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద మూడు, ఐదో సంవత్సరం న్యాయ విద్యార్థులు 78 మంది శుక్రవారం సాయంత్రం వర్షంలో బైఠాయించడం సంచలనం రేపింది. విషయం తెలిసి అక్కడకు వెళ్లిన విలేఖరులకు గతంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. అంతర్జాతీయ విద్యాప్రమాణాలతో జాతీయ స్థాయిలో ఇక్కడ నిర్వహిస్తున్న ఈ న్యాయ విశ్వవిద్యాలయంలో సుమారు 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. యూనివర్శిటీ నిబంధన ప్రకారం 1,3,5,7,9 సెమిస్టర్ పరీక్షలు ఆర్ట్స్ విభాగంలోను, 2,4,6,8,10 సెమిస్టర్లు ఈవెన్ విభాగం విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. మొత్తం ఐదేళ్ళ కాలంతో ముగిసే లా-కోర్సును విద్యార్థులు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో ఇక్కడ న్యాయశాస్త్ర విద్యార్థులకు సంబంధించి ఫస్ట్ సెమిస్టర్‌లో అన్ని సబ్జెక్టులు పాసైన వారు థర్డ్ సెమిస్టర్ రాసేందుకు, థర్డ్ సెమిస్టర్‌లో అన్ని పరీక్షలు పాసైన వారు 5వ సెమిస్టర్‌కు అర్హత సాధిస్తారు. మొత్తం 12 పేపర్లను న్యాయ విద్యార్థులు రాయాలి. అయితే గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల్లో సబ్జెక్టులు ఉండిపోయిన విద్యార్థులకు జనవరిలో సప్లిమెంటరీ నిర్వహిస్తారు. మార్చిలో నిర్వహించే థర్డ్ సెమిస్టర్‌లో సబ్జెక్టులు మిగిలిపోయిన వారికి రిపీట్ పరీక్షలు జూలైలో నిర్వహిస్తారు. అయితే సుమారు 78 మంది విద్యార్థుల్లో నిబంధనల ప్రకారం 70 శాతం హాజరు లేని కారణంగా కొందరు, పరీక్షలు రాసి కూడా అర్హత సాధించలేని వారు మొత్తం 78 మంది విద్యార్థులు ఉండిపోయారు. దీంతో డిఎస్‌ఎన్‌ఎల్‌యు కులపతి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణ ఆదేశాల మేరకు ఇక్కడి వర్శిటీ ఉపకులపతి వారిని డీటైన్ చేసి యూనివర్శిటీని ఖాళీ చేయాలని శుక్రవారం ఆదేశించారు. దీంతో తాము ఇళ్ళకు వెళ్ళేది లేదని, తమను యూనివర్శిటీ హాస్టల్ లోనే కొనసాగించాలంటూ ఆ విద్యార్థులు వర్షంలో బైఠాయించారు.
డిఎస్‌ఎన్‌ఎల్‌యు ఉపకులపతి కేశవరావు వివరణ
ఇదిలా ఉండగా ఇక్కడి యూనివర్శిటీ నుంచి డీటైన్ అయిన 78 మంది విద్యార్థులు గేటు బయట బైఠాయించిన సంఘటనపై యూనివర్సిటీ వీసీ కేశశరావును విలేఖరులు వివరణ కోరగా, జాతీయ స్థాయి యూనివర్శిటీ నిబంధనల ప్రకారం, వర్శిటీ కులపతి ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతేకాకుండా గతంలో తాను ఇటువంటి విద్యార్థుల కోసం మానవతా దృక్పథంతో మరో సారి రిపీట్ పరీక్ష నిర్వహించినందుకు కొంతమంది విద్యార్థులు కోర్టును ఆశ్రయించారని, ఆ నేపథ్యంలో తాను అనవసరంగా మాటలు పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీటైన అయిన విద్యార్థుల తల్లిదండ్రులకు వీరు క్వాలిఫై కాలేదనే విషయం తెలిసిపోతుందనే భయంతోనే వారు ఇలా బైఠాయించారన్నారు. అంతేకాకుండా ఇప్పుడు డీటైన్ అయిన విద్యార్థులు మళ్ళీ అదే యేడాది కోర్సును పూర్తిచేయాలంటే పరీక్ష ఫీజులు కూడా కట్టాలని, అప్పుడు తల్లిదండ్రులు వీరిని నిలదీస్తారన్న భయంతోనే ఇలా చేస్తున్నారన్నారు. ఈ విషయంలో తన తప్పులేదని, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇచ్చిన తీర్పు, ప్రస్తుత చీఫ్ జస్టిస్, డిఎస్‌ఎన్‌ఎల్‌యు కులపతి ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరణ ఇచ్చారు.