ఆంధ్రప్రదేశ్‌

వణికిస్తున్న హెచ్1ఎన్1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, అక్టోబర్ 16: జిల్లాను నిన్న మొన్నటి వరకు డెంగ్యూ పట్టిపీడించగా, తాజాగా స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రజలను కలవరపెడుతోంది. ఇప్పటికే స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడి ఇద్దరు మృతి చెందడంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని సాలూరు పట్టణానికి చెందిన బోనుమంతి వౌనిక (24) అలియాస్ సంతోషి స్వైన్‌ఫ్లూ వ్యాధితో విశాఖలోని చెస్ట్ ఆసుపత్రిలో మృతి చెందింది. ఈ నెల 12న ఆమెకు స్వైన్ ఫ్లూ వ్యాధి ఉందని గుర్తించిన తరువాత విశాఖలోని చెస్ట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ నాలుగు రోజులపాటు చికిత్సను అందించినప్పటికీ ఆమె మృతి చెందింది. ఇదిలా ఉండగా తాజాగా విజయనగరం పట్టణంలోని స్టేడియం వీధికి చెందిన దుప్పాడ శ్రీహరి (67) కూడా స్వైన్ ఫ్లూ బారినపడటంతో ఆయనను విశాఖలోని సెవెన్‌హిల్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన అక్కడ మృతి చెందినట్టు బోగాట్టా. కాగా, మరో నాలుగు రోజుల్లో ఉత్తరాంధ్ర శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవం ఉండటంతో స్వైన్‌ఫ్లూ జిల్లాను తాకడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇదే విషయమై డిసిహెచ్‌ఎస్ డాక్టర్ ఉషశ్రీ వద్ద ప్రస్తావించగా స్వైన్ ఫ్లూ బారినపడి సాలూరుకు చెందిన వౌనిక మృతి చెందిన విషయం వాస్తవమేనన్నారు. కాగా, విజయనగరంనకు చెందిన దుప్పాడ శ్రీహరి పరిస్ధితి విషమంగా ఉందని తెలిపారు. స్వైన్‌ఫ్లూ వ్యాధి బారిన పడిన రోగుల కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును కేటాయించినట్టు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సీతారామరాజు తెలిపారు. స్వైన్‌ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హరి జవహర్‌లాల్ కూడా ప్రజలను అప్రమత్తం చేశారు.