ఆంధ్రప్రదేశ్‌

దేశం గొప్పగా చెప్పుకునేలా విద్యార్థులు ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, నవంబర్ 9: యోగివేమన యూనివర్సిటీ విద్యార్థుల గురించి ఊరువాడ, జిల్లా, రాష్ట్రం, దేశం గొప్పగా చెప్పుకునేలా ఎదగాలని, శాస్త్ర సాంకేతిక విద్యలో రాణిస్తూ ప్రపంచానికి మేలు జరిగేలా పరిశోధనలు చేయాలని మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. కడప నగరంలోని యోగివేమన యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన ఏపీ సైన్స్ కాంగ్రెస్ సభకు ముఖ్యఅతిధిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యకే ఉందన్నారు. బడ్జెట్‌లో 15 శాతాన్ని ముఖ్యమంత్రి విద్యకే వెచ్చిస్తున్నారన్నారు. రూ.17 వేల కోట్ల లోటు బడ్జెట్‌లో కూడా విద్యకు అత్యంత ప్రాధాన్యతనివ్వడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విద్యపట్ల ఉన్న ఆసక్తిని తెలుపుతోందన్నారు. తిరుపతి, విజయవాడ, విశాఖ తర్వాత నాల్గవసారి కడప జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయంలో ఏపీ సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నామన్నారు. 2006లో కడపలో ఏర్పాటైన వైవీయూ అతి కొద్దికాలంలోనే అనూహ్యమైన అభివృద్ధి సాధించిందన్నారు. ఆరు కోర్సులతో మొదలై నేడు 30 కోర్సులకు చేరుకుందన్నారు. వర్శిటీ ఏర్పాటైన మొదటి ఏడాదే యూజీసీ నుంచి 2-ఎఫ్ యోగ్యత పొందిందన్నారు. 2011లో 12-బి అర్హత, 2016లో న్యాక్-బి గ్రేడ్ సాధించడం వేమన విశ్వవిద్యాలయ ప్రగతికి నిదర్శనమన్నారు. 2017లో రాష్ట్రప్రభుత్వం మొట్టమొదటి ఏపీ గ్రీనరీ అవార్డును యోగివేమన సాధించిందన్నారు. యోగివేమన యూనివర్సిటీ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకన్నా ముందంజలో ఉందన్నారు. దీన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. తొలిదశలో విడుదలైన రూసా నిధులు రూ.15 కోట్లను అత్యంత సమర్థవంతంగా ఖర్చుచేసి 2వ దశలో మరో రూ.10 కోట్లను విశ్వవిద్యాలయం రాబట్టుకోగలిగిందన్నారు. ఐదేళ్లలో విశ్వవిద్యాలయానికి చెందిన ఏడుగురు అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందించిందన్నారు. 17 మంది సహాయాచార్యులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన యువశాస్తవ్రేత్త పురస్కారాలు లభించాయన్నారు. కడప విద్యార్థులు నాసాకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. వీరి కోసం అవసరమైతే రూ.25 కోట్లు ఖర్చుచేయండని ముఖ్యమంత్రి ముచ్చటపడి ఆదేశించారన్నారు. విద్యార్థులు నిపుణుల సలహాలు తీసుకుంటూ ముందుకు సాగేందుకు ప్రభుత్వం అందిస్తున్న సువర్ణ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థి దశ నుంచే లక్ష్యం నిర్దేశించుకున్నారని, ఇప్పటికీ తానొక నిత్య విద్యార్థినినే అని అంటుంటారన్నారు. కొత్త విషయాలు, ఆవిష్కరణల గురించి సీఎంకు చెబితే చిన్నపిల్లాడిలా మారిపోతారని, వాటి గురించి పూర్తిగా తెలుసుకుని అవసరమైతే ప్రభుత్వ సహాయాన్ని సైతం అందించమని ఆదేశిస్తాడన్నారు.