ఆంధ్రప్రదేశ్‌

పారదర్శకంగా ధాన్యం సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 13: ధాన్యం సేకరణ విషయంలో ప్రభుత్వ నిబంధనల కనుగుణంగా పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రులు స్పష్టం చేశారు. రాష్టవ్య్రాప్తంగా మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీ రైస్‌మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పౌరసఫరాల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఉన్నతాధికారులు మంగళవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సేకరణలో తలెత్తుతున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మిల్లర్లు విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు బియ్యం మిల్లులకు వినియోగించే 100హెచ్‌పీని ఎల్‌టీ కనెక్షన్‌గా పరిగణిస్తున్నారని దీన్ని 200 హెచ్‌పీకి పెంచాలని మిల్లర్లు కోరారు. దీనిపై మంత్రులు స్పందిస్తూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లి త్వరలో పరిష్కరిస్తామన్నారు. పౌరసరఫరాలశాఖకు బియ్యం సరఫరాపై మిల్లర్లు, ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంఒయులో కఠిన నిబంధనలు తొలగించాలని ప్రతిపాదించారు. ప్రభుత్వానికి సీఎంఆర్ కింద రీసైక్లింగ్ బియ్యం సరఫరా చేస్తే అధికారులు తమపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారని మంత్రులకు వివరించారు. బియ్యం మిల్లుల నుంచి ఉత్పత్తి అయ్యే తవుడు, నూక, ఊకలపై 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారని, పొరుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూలు చేయటంలేదని తెలిపారు. దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి ప్రత్తిపాటి హామీ ఇచ్చారు. కేంద్రం అమలుచేస్తున్న రూ. 15 పాలసీని రూ. 10కి మార్చాలని కోరారు. అన్ని జిల్లాలో ప్రభుత్వం చెల్లిస్తున్న రవాణాచార్జీలు ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా అవుతున్న బియ్యంపై మంత్రులు సోమిరెడ్డి, ప్రత్తిపాటి ఆరా తీశారు. అవి రాష్ట్రానికి చెందినవి కావని, తెలంగాణ నుంచి ఎగుమతి అవుతున్నాయని మిల్లర్లు వివరించారు. అక్రమార్కుల సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు. ఖరీఫ్ ధాన్యం సేకరణలో రైతుల్ని ఇబ్బంది పెట్టవద్దని మిల్లర్లను మంత్రి సోమిరెడ్డి హెచ్చరించారు. ఏ గ్రేడ్‌కు రూ 1790, బీ గ్రేడ్‌కు రూ 1750 ధర తగ్గకుండా కొనుగోలు చేయాలని నిర్దేశించారు. మిల్లర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ధాన్యంలో మచ్చ ఎక్కువగా ఉంటోందని కేంద్రంతో సంప్రతింపులు జరిపి వెసులుబాటు కల్పించాలని మిల్లర్లు చేసిన విజ్ఞాపనపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. రైతుల నుంచి కొనుగోలు చేస్తే ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరుపుతున్నామని తమకు కూడా మిల్లింగ్, రవాణా చార్జీలు ఆన్‌లైన్‌లో చెల్లించాలని కోరగా పౌరసరఫరాలశాఖ కమిషనర్ రాజశేఖర్ సుముఖత వ్యక్తంచేశారు. ఇంకా బ్యాంక్ గ్యారంటీని ఆరు నెలల నుంచి నాలుగు నెలలకు తగ్గించాలని, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పొలాల వద్ద రైతుల వివరాలు అప్‌లోడ్ చేసి సేకరించటంలో ఎదురవుతున్న ఇబ్బందులను మిల్లర్లు వివరించారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఖరీఫ్ ప్రారంభమైన తరువాత సమస్యలను ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తామని రాజశేఖర్ హామీ ఇచ్చారు. పట్టిసీమ ద్వారా 25 లక్షల ఎకరాలకు సాగునీరందడంతో పదిశాతం ధాన్యం దిగుబడులు పెరిగాయని, ఇందుకు ముఖ్యమంత్రికి మిల్లర్లు కృతజ్ఞతలు తెలిపారు.