ఆంధ్రప్రదేశ్‌

ఇనుమడించిన ఇస్రో ప్రతిష్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, నవంబర్ 14: వరుస రాకెట్ విజయాలతో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) కీర్తి ప్రతిష్టలు ప్రపంచ దేశాలకు పాకడమే కాకుండా మంచి గుర్తింపుసైతం సంపాదించుకొంది. ఇక్కడ నుండి ప్రయోగించే ప్రతి రాకెట్ స్వదేశీ పరిజ్ఞానం కావడం ఒకవంతైతే వినూత్న ప్రయోగాలు చేపట్టి మన శాస్తవ్రేత్తలు ప్రపంచ దేశాలకు దీటుగా నిలుస్తున్నారు. అంతేకాకుండా తక్కువ ఖర్చుతో భారీ ప్రయోగాలు చేపట్టి వాణిజ్య పరంగా ఇతర దేశాల నుండి కాసుల వర్షం కురుస్తోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ట మరో సారి ఇనుమడించింది. ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి ప్రయోగించిన జీశాట్-29 భారీ ఉపగ్రహ ప్రయోగం తొలి అడుగులోనే విజయవంతం కావడంతో శాస్తవ్రేత్తల ఉత్సాహం మరింత రెట్టింపయ్యింది. అత్యంత బరువైన రాకెట్‌ను సవాల్‌గా తీసుకొని మరోసారి ప్రయోగించి మన శాస్తవ్రేత్తలు తన సత్తా ఏమిటో నిరూపించారు. అంతేకాకుండా ఈ ప్రయోగ విజయంతో కమ్యూనికేషన్ రంగాల్లో అభివృద్ధి చెందిన అమెరికా, రష్యా, జపాన్ దేశాలకు దీటుగా భారత్ నిలవడం విశేషం. విదేశాలు సైతం అసాధ్యమన్న దానిని మన శాస్తవ్రేత్తలు సుసాధ్యం చేశారు. ఏకంగా 18 ఏళ్ల కలల సాకారాన్ని నిజం చేశారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి బుధవారం సాయంత్రం 5:08గంటలకు జీఎస్‌ఎల్‌వీ మార్క్3-డి 2 రాకెట్ ద్వారా జీశాట్-29 ఉపగ్రహాన్ని అనుకొన్న భూ స్థిర కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. మన దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకొని 18 ఏళ్ల క్రితం భారీ ప్రయోగాలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టిన ఇస్రో నేడు నిజం చేసింది. నేడు ఉన్న పరిస్థితిల్లో దేశానికి మెరుగైన సమాచార వ్యవస్థను అందించేందుకు ఈ ఉపగ్రహాన్ని రూపకల్పనచేసి విజయవంతంగా ప్రయోగించారు. దీంతో ఈ ప్రయోగం షార్‌లో సిగలో మరో కలికితురాయిగా నిలిచింది. దీంతో ఇస్రో ప్రతిష్ట కూడా ఇనుమడించి ఆగ్ర దేశాల సరసర భారత్ నిలిచింది.
ఇప్పటి వరకు షార్ నుండి మొత్తం 12 జీఎస్‌ఎల్‌వీలు ప్రయోగాలు జరిగాయి. ఇది 13వ ప్రయోగం కావడమే కాకుండా దేశ అసవరాల కోసం భారీ రాకెట్‌ను స్వదేశీ క్రయోజనిక్‌తో ఉపగ్రహ ప్రయోగం చేపట్టి దిగ్విజయం చేశారు. చిన్న రాకెట్ల నుండి మొదలు పెట్టిన బుడిబుడి అడుగులు వేసుకుంటున్న శాస్తవ్రేత్తలు నేడు భారీ ప్రయోగాల వైపు పరుగులు తీసే స్థాయికి ఎదిగారు. శ్రీహరికోట నుండి బుధవారం ప్రయోగించిన జీఎల్‌ఎల్‌వీ మార్క్3-డీ 2 ద్వారా 3,600 కిలోల బరువు గల జీశాట్-29 ఉపగ్రహాన్ని 16:43మిషాల్లో భూమధ్య రేఖకు 36వేల కి.మీ దూరంలో భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ప్రయోగం విజయవంతం కావడంతో షార్‌లో ఉద్యోగులందరూ సంబరాలు చేసుకొన్నారు. షార్‌తో పాటు పక్కనే సూళ్లూరుపేట పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కమ్యూనికేషన్ రంగానికి చెందిన జీశాట్ సిరీస్‌లో ఇస్రో సమాచార రంగానికి చెందిన మొత్తం మూడు ఉపగ్రహాలు పంపేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో 2017లో జూన్ 5న జీఎస్‌ఎల్‌వీ మార్క్3-డీ 1 రాకెట్ ద్వారా జీశాట్-19 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. ప్రస్తుతం జీఎస్‌ఎల్‌వీ మార్క్3-డీ 2 వాహక నౌక ద్వారా అత్యంత బరువైన జీశాట్-29 ఉపగ్రహాన్ని రోదసీలోకి విజయవంతంగా పంపారు. ఇప్పటి వరకు ఇస్రో 3నుంచి 4టన్నుల బరువైన రాకెట్లను మాత్రమే ప్రయోగించి ఉంది. బుధవారం ప్రయోగించిన జీఎల్‌ఎల్‌వీ మార్క్ 3 రాకెట్ 640టన్నులు కావడం విశేషం. ఈ ప్రయోగ విజయంతో మరిన్ని భారీ ప్రయోగాలకు వైపు శాస్తవ్రేత్తలు చూస్తున్నారు.
జీశాట్-29 ఉపగ్రహంతో అదనపు ప్రయోజనం
10 సంవత్సరాల పాటు అందనున్న సేవలు
ఇస్రో ప్రయోగించిన జీశాట్-29 ఉపగ్రహంతో అదనపు ప్రయోజనం చేకూరనుంది. సమాచార రంగంలో కొత్త పుంతలు తొక్కి సేవలను మరింత విసృతం చేసేందుకు ఈ ప్రయోగం ఎంతో ఉపయోగపడుతుందని ఇస్రో శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ఈ ఉపగ్రహంతో కేయూ, కేఏ రెండు రకాల పేలోడ్ బ్యాండ్‌లు శాస్తవ్రేత్తలు పొందుపరిచారు. ప్రధాన మంత్రి డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇస్రో ఈ ఉపగ్రహాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో జీశాట్-29 ఉపగ్రహాన్ని రూపకల్పన చేశారు. దీని ద్వారా మరో రెండు నూతన అంతరిక్ష సాంకేతికతల పై అధ్యయనం చేయనున్నారు. ఈ ప్రయోగానికి ఇస్రో మొత్తం 360కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. ఇందులో ఉపగ్రహానికి రూ.60కోట్లు కాగా వాహక నౌక తయారీకి మొత్తం 300కోట్ల వ్యయాన్ని వెచ్చించారు. ఈ ఉపగ్రహ సేవలు 10సంవత్సరాల పాటు అందించనుంది.