ఆంధ్రప్రదేశ్‌

పల్నాడులో మావోల లేఖల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 15: ఇటీవల కాలంలో ప్రశాంతంగా ఉన్న గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో మావోల పేరిట ప్రత్యక్షమైన లేఖలు కలకలం రేపాయి. ఒకప్పుడు పల్నాడు ప్రాంతం మావోలకు అడ్డాగా ఉండేది. అయితే కాలక్రమేణా చోటుచేసుకున్న పరిణామాలతో దాదాపు మావోలు కనుమరుగయ్యారన్న ధీమాతో ప్రశాంతంగా ఉన్న పల్నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గురువారం దాచేపల్లి నుంచి తంగెడ వెళ్లే దారిలో ఉన్న బీసీ హాస్టల్ గోడలపై మావోయిస్టు పార్టీ పల్నాడు పేరిట రెండు వేర్వేరు లేఖలు అంటించి ఉండటం దావాలనంగా వ్యాపించింది. రేషన్ బియ్యం దొంగ రవాణా వ్యాపారులకు హెచ్చరిక అంటూ ఒక లేఖ, అధిక వడ్డీ వ్యాపారులకు హెచ్చరిక అంటూ మరో లేఖ గోడలపై అంటించారు. రేషన్‌బియ్యం దొంగ రవాణాకు సంబంధించిన లేఖలో నేరుగా వ్యక్తి పేరును ప్రస్తావించగా, అధిక వడ్డీకి సంబంధించిన లేఖలో పేర్లను ప్రస్తావించకుండా అందరి సమాచారం తమ వద్ద ఉందని పేర్కొన్నారు. రేషన్‌బియ్యం దొంగ రవాణా చేస్తున్న మందపాటి నరసింహారావు, నెలవారీ లంచాలు, మామూళ్లు తీసుకుని సహకరిస్తున్న రాజకీయ నాయకులకు, పత్రికా విలేఖర్లకు ఇదే మా మొదటి, చివరి హెచ్చరిక అని స్పష్టంచేశారు. నెలరోజుల్లో మీ అక్రమ వ్యాపారాన్ని మూసివేయాలని, లేనిపక్షంలో ప్రజాకోర్టులో తీశ్రమైన శిక్షను అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. చివరగా విప్లవాభినందనలతో మావోయిస్టు పార్టీ పల్నాడు పేరిట ముగించారు. అధిక వడ్డీ వ్యాపారులను హెచ్చరిస్తూ అంటించిన లేఖలో రోజువారీ, వారాల వారీ, నెలవారీ వడ్డీలు, తాకట్టు రిజిస్ట్రేషన్లు, ఇతర అధిక వడ్డీ వ్యాపారమార్గాల ద్వారా అక్రమ వ్యాపారం చేస్తున్న వారికి హెచ్చరిక అంటూ పేర్కొన్నారు. అక్రమ వడ్డీ వ్యాపారులు, అన్నీ మానేసి సక్రమమైన పద్ధతిలో జీవనం సాగించాల్సిందిగా కోరుతున్నామని, లేకుంటే ప్రజాకోర్టులో తీవ్రమైన శిక్షను అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరికలు చేశారు. గతంలో పిడుగురాళ్లలో ఓ ఎలక్ట్రానిక్, ఫర్నీచర్ వ్యాపారికి సైతం ఇదే రకమైన లేఖను రాస్తూ నేరుగా ఇంటికి వెళ్లి అందజేశారు. ఇదే సమయంలో భారీ ఎత్తున డబ్బులను సైతం డిమాండ్ చేయడం గమనార్హం. పోలీసులకు తెలియజేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు. అయితే సదరు వ్యాపారి పోలీసులను ఆశ్రయించడంతో దర్యాప్తు జరిపిన మీదట నకిలీ మావోల పనిగా తేల్చారు. ప్రస్తుతం దాచేపల్లిలో వెలసిన లేఖలు సైతం ఆకతాయిల పనేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయమై రూరల్ ఎస్‌పి ఎస్‌వి రాజశేఖరబాబును వివరణ కోరగా.. లేఖలు అంటించిన మాట వాస్తవమేనని, ఇదంతా నకిలీ మావోల పనేనని భావిస్తున్నామని, త్వరలో ఈ విషయమై దర్యాప్తు చేసి బాధ్యులను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.