ఆంధ్రప్రదేశ్‌

జర్నలిస్టులందరికీ గృహ వసతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 15: రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ గృహ వసతి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయంటూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఇక నేరుగా డీపీఆర్‌వోలకే దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని అన్నారు. గురువారం స్థానిక ప్రైవేట్ హోటల్‌లో జర్నలిస్టులతో ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులు 19వేలు ఉన్నారని అందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. పలు కారణాల వల్ల ఆశించిన స్థాయిలో ఆన్‌లైన్‌లో జర్నలిస్టుల గృహ నిర్మాణాలకు దరఖాస్తులు రాలేదన్నారు. రాష్ట్రంలో 19వేలకు పైగా ప్రభుత్వ గుర్తింపు కలిగిన జర్నలిస్ట్‌లు ఉంటే కేవలం 5,323 గృహ నిర్మాణాలకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయన్నారు. గ్రామీణ ప్రాంతాల జర్నలిస్టుల నుండి 2,303, పట్టణ ప్రాంత జర్నలిస్టుల నుండి 3,020 మంది నుంచి జర్నలిస్ట్‌ల గృహ నిర్మాణాలకు దరఖాస్తులు వచ్చాయన్నారు.
50 మందికి ఇళ్లు మంజూరయ్యాయని, 617 మందికి సొంత ఇళ్ల స్థలాలు ఉన్నాయని, 87 మందికి గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరై ఉన్నాయని, పూర్తికాని ఇళ్లల్లో జర్నలిస్టులకు సబ్సిడీ ఇచ్చే వెసులుబాటు ఉందన్నారు. జర్నలిస్టుల గృహ నిర్మాణ సబ్సిడీ కోసం ప్రభుత్వం రూ. 100 కోట్లు మొదటి విడతగా కేటాయించిందన్నారు. గ్రామీణ జర్నలిస్టుల కోసం బుధవారం ముఖ్యమంత్రి ఇళ్లు మంజూరుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. టిట్‌కో సీఈ శ్రీమన్నారాయణ మాట్లాడుతూ 13 జిల్లాల్లో 110 మున్సిపాల్టీల్లో ఏహెచ్‌సి పథకం కింద త్రీప్లస్ త్రీ అపార్ట్‌మెంట్స్ షీర్‌వాల్ టెక్నాలజీలో నిర్మిస్తామన్నారు. ఇప్పటికే 1.10 వేల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని, అందులో 75 వేల ఇళ్లు అన్ని సౌకర్యాలు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ ఇళ్లను ఈ నెల 28న ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. 5.40 లక్షల ఇళ్లు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయగా, వీటిలో 4.54 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయన్నారు. జర్నలిస్టుల ఆత్మీయ సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎస్ వెంకటేశ్వర్, మీడియా రిలేషన్స్ సంయుక్త సంచాలకులు కిరణ్‌కుమార్, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ సీఈ మల్లికార్జున్, సాంకేతిక నిపుణులు శ్రీకాంత్, పలువురు జర్నలిస్ట్ సంఘాల నాయకులు, రిపోర్టర్లు, వీడియోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు.