ఆంధ్రప్రదేశ్‌

చంద్రన్న బీమా క్లెయిమ్‌ల పరిష్కారంలో జాప్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 16: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న చంద్రన్న బీమా పథకానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి సత్వరమే సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర పరిశ్రమలు, కార్మికశాఖ మంత్రి పితాని సత్య నారాయణ ఆదేశించారు. సచివాలయం రెండవ బ్లాక్‌లోని తన కార్యాలయంలో చంద్రన్న బీమాపై శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పూర్తిస్థాయిలో అమలు బాధ్యతలు నిర్వహిస్తున్న కమిషనర్, సిబ్బందిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. చంద్రన్న బీమా, చంద్రన్న రైతుబీమా పథకాలకు సంబంధించి ప్రమాద మరణాలు, సహజ మరణాలు, పరిష్కరించిన క్లెయిమ్‌లు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకంపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నారని త్వరితగతిన కేసులు పరిష్కరించాలని సూచించారు. క్లెయిమ్ దరఖాస్తుల అప్‌లోడ్, పరిష్కారం విషయంలో అలసత్వం వహించరాదని స్పష్టం చేశారు. బీమా కంపెనీలకు అవసరమైన పత్రాలు అందజేస్తే సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రమాద బీమా పథకం కింద క్లెయిమ్‌లను ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పరిష్కరించాల్సి ఉంటుందని ఎఫ్‌ఐఆర్ కాపీని త్వరితగతిన బాధిత కుటుంబాలకు అందించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రమాదవశాత్తు అంగవైకల్యం ఏర్పడితే వారం రోజుల్లోగా సర్ట్ఫికెట్ అందించాలన్నారు. సాధ్యపడకపోతే అందుకు కారణాలను వివరించాలని సూచించారు. ఈ పథకం కింద 99 శాతం పరిష్కరించిన ఎల్‌ఐసీ అధికారులను అభినందిస్తూ ఆ ఒక్క శాతాన్ని ఎందుకు పెండింగ్‌లో ఉంచారని ప్రశ్నించారు. పదిరోజుల్లో బీమా క్లెయిమ్‌లను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకానికి సంబంధించి ప్రతి శాఖలో ఒక వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలని ప్రత్యేక ప్రధానకార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్‌కు సూచించారు. మానిటరింగ్ బాధ్యతలను ప్రత్యేకించి ఓ ఉద్యోగికి అప్పగించాలన్నారు.
పోలీస్, వైద్య, ఆరోగ్యశాఖతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలని కోరారు. బీమా పథకం, నియమ నిబంధనలపై వైద్యులకు అవగాహన కల్పించాలన్నారు. టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రం ప్రపంచ దేశాలతో పోటీపడుతుంటే కింది స్థాయిలో మాత్రం వినియోగించుకోవటంలేదని అసహనం వ్యక్తంచేశారు.
తిరస్కరించిన క్లెయిమ్‌లను మరోసారి పరిశీలించి జాప్యం లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. పోలీస్‌శాఖలో పెండింగ్ కేసులు 400 కాగా ప్రస్తుతం 80కు తగ్గిందని అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా శావల్యాపురానికి చెందిన ఓ కేసు గురించి మంత్రి వివరించగా అధికారులు పరిష్కార మార్గాలను సూచించారు.
కార్మికశాఖ కమిషనర్ డి వరప్రసాద్, సెర్ప్ సీఈఒ డాక్టర్ కృష్ణమోహన్, ఏపీ వైద్యవిధాన పరిషత్ అధికారి శ్రీదేవి, పోలీస్ అధికారులు, బీమా సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.