ఆంధ్రప్రదేశ్‌

పట్టాలు తప్పిన గూడ్స్ వ్యాగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 16: రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం గూడ్స్‌రైలుకు చెందిన వ్యాగన్ పట్టాలు తప్పింది. తాల్చేరు నుంచి బొగ్గులోడుతో బయలుదేరిన గూడ్స్ రైలు ఉదయం 6గంటల సమయంలో మెముకార్‌షెడ్ సమీపంలోకి వచ్చేసరికి ఇంజన్ వెనుక ఉన్న వ్యాగన్ పట్టాలు తప్పింది. ఆసమయంలో రైలు తక్కువ వేగంతో వెళుతుండటం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఈసంఘటనతో విజయవాడ-విశాఖపట్నం మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే వర్గాల కథనం ప్రకారం తాల్చేరు నుంచి బొగ్గులోడుతో బయలుదేరిన గూడ్స్‌రైలు రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ దాటి గోదావరి రైల్వేస్టేషన్ మార్గంలో మెముకార్ షెడ్ వద్దకు చేరుకునేసరికి ఇంజను వెనుక ఉన్న వ్యాగన్ పట్టాలు తప్పింది. దీనితో రోడ్డుకంరైలు వంతెన మీదుగా మాత్రమే నడిపారు. ఈ కారణంగా పలు రైళ్లు 2-3 గంటలు ఆలస్యంగా నడిచాయి.
రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో 2,3 ప్లాట్‌ఫారాలపై రైళ్ల రాకపోకలను నియంత్రించారు. రోడ్డుకంరైలు వంతెన మీదుగా వెళ్లేందుకు వీలుగా అన్ని రైళ్లను ఒకటో నెంబరు ప్లాట్‌ఫారం మీదకు తీసుకురావడంతో విశాఖపట్నం వైపు వెళ్లే ప్రయాణీకులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. గోదావరి రైల్వేస్టేషన్‌కు రావాల్సిన రైళ్లను దారిమళ్లించడంతో ప్రయాణీకులు వ్యయప్రయాసలకు ఓర్చి రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌కు వెళ్లి రైళ్లు ఎక్కాల్సి వచ్చింది. రైల్వే అధికారులు, సిబ్బంది సుమారు 4గంటల పాటు శ్రమించి పట్టాలు తప్పిన వ్యాగన్‌ను పునరుద్ధరించారు. ఈసంఘటనపై విచారణ జరిగిన తరువాత వ్యాగన్ ఎందుకు పట్టాలు తప్పిందన్నది తెలుస్తుందని రాజమహేంద్రవరం స్టేషన్ మేనేజర్ ప్రభాకరరావు తెలిపారు.