ఆంధ్రప్రదేశ్‌

ఒత్తిడి లేని విద్యా బోధన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 17: సాంకేతికత జోడించుకుంటూ ఒత్తిడి లేని బోధన విధానం అందుబాటులోకి రావాలని యునెస్కో, మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్(ఎంజీఐఈపీ) హై లెవెల్ పాలసీ ఫోరం (హెచ్‌ఎల్‌పిఎఫ్) సూచించింది. యునెస్కో, ఎంజీఐఈపీ ఆధ్వర్యంలో విశాఖలో మూడు రోజులుగా జరుగుతున్న ఎడ్యుటెక్ 2018 సదస్సు శనివారంతో ముగిసింది. సదస్సులో 60 దేశాలకు చెందిన 1000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ అంశాలపై నిపుణులు, విద్యా వేత్తలు, స్టేక్‌హోల్డర్స్ విస్తృతంగా చర్చిలు జరిపి విద్యా బోధన, విద్యార్థులపై ఒత్తిడి తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు. అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి ప్రాంతీయ, వర్గ ప్రాతిపదికన స్థానిక అంశాల మేరకు అవసరమైన సూచనలు చేయాలని నిర్ణయించారు. విభిన్న, స్థానిక అంశాలు, సందర్భాలకు అభ్యాసకుల అవసరాలను గుర్తించి రూపొందించాలని సూచించారు. యునెస్కో, ఎంజీఐఈపీ గవర్నింగ్ బాడీ ఆమోదం, తదుపరి 2019లో జరిగే 206వ యునెస్కో ఎగ్జిక్యుటివ్ బోర్డు సమావేశం, 40వ యునెస్కో సాధారణ సమావేశం ఆమోదం కొరకు ఎడ్యుటెక్ 2018 సిఫార్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ యునెస్కో, ఎంజీఐఈపీ ఆధ్వర్యంలో జరిగిన ఎడ్యుటెక్ 2018 సూచనలపై హర్షాతిరేకం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాలకు చెందిన దాదాపు 1000 మంది విద్యావేత్తలు, నిపుణులు పలు అంశాలను మథించి వైజాగ్ డిక్లరేషన్స్‌ను రూపొందించారన్నారు. ప్రస్తుతం వ్యవస్థలో అమలవుతున్న విద్యా విధానం, బోధనవో సమూల మార్పులు అవసరమని ఎడ్యుటెక్ భావించిందన్నారు. డిజిటల్ లెర్నింగ్, గేమింగ్, బోధన వంటి అంశాలను విస్తృతస్థాయిలో అమల్లోకి తీసుకురావడం ద్వారా విద్యార్థికి, అభ్యాసానికి పటిష్ఠమైన వారధి నెలకొంటుందన్నారు. తద్వారా సమాజానికి ఉపకరించే నూతన ఆవిష్కరణలు, చేసే మేధావులు, మరికొంత మందిని తీర్చిదిద్దేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఎడ్యుటెక్‌లో సూచించిన అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం విశేష ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అలాగే 2020 నాటికి ఎడ్యుటెక్ మార్కెట్ 252 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో విశాఖలో ఏర్పాటు చేస్తున్న ఐ హబ్ నాణ్యమైన డిజిటల్ బోధన విధానాలకు ప్రపంచంలోనే ప్రముఖ కేంద్రంగా నిలుస్తుందన్న అభిప్రాయాన్ని మంత్రి గంటా వ్యక్తం చేశారు. యునెస్కో, ఎంజీఐఈపీ డైరెక్టర్ అనంత దొరయ్యప్ప మాట్లాడుతూ రెండేళ్ళుగా ఎడ్యుటెక్‌ను విశాఖలో విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఎడ్యుటెక్ 2018 సూచనలు యునెస్కో గవర్నింగ్ బాడీలో ఆమోదించి ప్రపంచానికి అందిస్తామన్నారు. రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్ జీఎస్ పండాదాస్ మాట్లాడుతూ దేశంలో విభిన్న భాషలు, ప్రాంతాలు ఉన్నాయని, ఆయా స్థానిక భాషలు, ప్రాంతాలకు అనుగుణంగా ఎడ్యుటెక్ డిజిటల్ లెర్నింగ్, గేమింగ్ అంశాలను రూపొందించాలన్నారు.