ఆంధ్రప్రదేశ్‌

ఏపీ అవినీతిపై చార్జిషీట్ తెస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 13: నవ్యాంధ్రలో కింది నుంచి పైస్థాయి వరకూ చోటు చేసుకున్న అవినీతిపై త్వరలోనే ఛార్జిషీట్ తెస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీ మురళీధర రావు స్పష్టం చేశారు. విశాఖలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతికి అంతే లేకుండా పోయిందని, అన్ని రంగాల్లోనూ అవినీతి పెచ్చుమీరిందని ధ్వజమెత్తారు. కేంద్ర పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తనవిగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటోందని, దీనిపై బీజేపీ పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కలిగిస్తోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతమొందించాలన్న లక్ష్యంతో టీడీపీ ఆవిర్భవించిందని, దీనిలో భాగంగానే గత ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీల కూటమిలో టీడీపీని కలుపుకున్నామని మురళీధర రావు వెల్లడించారు. అయితే రాజకీయ లబ్ధి కోసం టీడీపీ బీజేపీ నుంచి వేరుపడి కాంగ్రెస్‌తో జతకట్టేందుకు సిద్ధ పడుతోందన్నారు. ఇది తెలుగు ప్రజలను తీవ్రంగా కలచివేస్తోందన్నారు. సుదీర్ఘ రాజకీయానుభవం కలిగిన చంద్రబాబు రాజకీయ అవగాహన లేని రాహుల్ గాంధీ నాయకత్వంలో నడవాలనుకోవడం దారుణమన్నారు. పూర్తి అవినీతి మయమైన కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టడం, రాజకీయ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చీకటి అధ్యాయంగా పేర్కొన్నారు.
ఇక జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) అంశాన్ని కాంగ్రెస్ సహా బీజేపీ వ్యతిరేక పార్టీలు రాజకీయ దురుద్దేశంతోనే రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. పౌర గుర్తింపును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారన్నారు. బంగ్లా చొరబాటుదారులకు వత్తాసు పలుకుతూ వీరు దేశానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్‌ఆర్‌సీని ప్రశ్నించడం, ఎన్‌ఆర్‌సీ అమలుతో దేశంలో అంతర్యుద్ధం వస్తుందంటూ ప్రచారం చేయడం అంటే దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వ్యతిరేకించడమేనన్నారు. అంశాన్ని బీజేపీ తేలికగా తీసుకోదని, జాతీయ పౌర గుర్తింపుపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు అస్థిరతతో కూడిన అభివృద్ధి నిరోధక శక్తులుగా మారాయని మండిపడ్డారు.
బీజేపీ బలపడుతోంది
ఇప్పటికే ఉత్తరాదిన పూర్తి ఆధిపత్యం కలిగిన బీజేపీ రానున్న ఎన్నికల నాటికి దక్షిణాదిలో కూడా బలమైన శక్తిగా ఎదుగుతుందని మురళీధర రావు ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల అనంతరం దక్షిణ, ఈశాన్య ప్రాంతాలపై దృష్టి సారించిన బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లో మంచి ఫలితాలు సాధించిందని, భవిష్యత్‌లో దక్షిణాదిలో కూడా అవే ఫలితాలు సాధిస్తామన్నారు. ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని మరింత బలోపేతం చేయడం, జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు, దానికి చట్టబద్దత కల్పించడం వంటి బిల్లులు ఆమోదంతో బీజేపీకి ఆయా వర్గాలపై ఉన్న అభిమానం వెల్లడైందన్నారు. సమావేశంలో ఎంపీ కే హరిబాబు, మాజీ మంత్రి పీ మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, నగర బీజేపీ అధ్యక్షుడు ఎం నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.