ఆంధ్రప్రదేశ్‌

తూ.గో.లో ముగిసిన జగన్మోహన్ రెడ్డి యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 13: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 236 రోజు తూర్పు గోదావరి జిల్లాలో తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో సోమవారంతో ముగిసింది. డి పోలవరం శివార్లలోని శిబిరం నుండి సోమవారం ఉదయం ప్రారంభమైన పాదయాత్ర తాటిపాక, బిల్ల నందూరు మీదుగా కాకరాపల్లి వరకు కొనసాగింది.
ఆదివారం సాయంత్రానికి 2711 కిలోమీటర్లు నడిచిన జగన్ సోమవారం మరో 8.2 కిలోమీటర్లు నడిచి ఇప్పటివరకు 2719.6 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశారు. సోమవారం సాయంత్రంతో తూర్పు గోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర ముగిసింది. మంగళవారం ఉదయం కోటనందూరు మండలం కాకరాపల్లి నుండి కిలోమీటరు నడిచిన అనంతరం విశాఖ జిల్లాలో అడుగిడనున్నారు. తొలుత విశాఖ జిల్లా ఏజన్సీ ముఖ ద్వారం నర్సీపట్నం నియోజకవర్గంలో జగన్ పర్యిటించనున్నారు.
సరిగ్గా రెండు నెలల క్రితం.. జూన్ 12న (187వ రోజు) జగన్ తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశించారు. రాజమండ్రి రోడ్ కం రైలు వంతెన మీదుగా ప్రవేశించిన ఆయనకు జనం బ్రహ్మరథం పట్టారు. జిల్లాలో 50రోజుల పాటు పాదయాత్ర చేశారు. రంపచోడవరం, రాజానగరం నియోజకవర్గాలు మినహా 17 నియోజకవర్గాల్లో 32 మండలాలు, 232 గ్రామాలతో పాటు 8 పుర పాలక సంఘాలు, 2 నగర పాలక సంస్థల్లో పర్యటించారు. 15చోట్ల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. రెండుచోట్ల ఆత్మీయ సమ్మేళనాల్లో ప్రసంగించారు. ముఖ్యంగా ఇదే జిల్లాలో జగన్ తన పాదయాత్రలో 2400, 2500, 2700కిమీమీటర్ల ప్రస్థానాన్ని పూర్తి చేయడం విశేషం! జిల్లాలో 412 కిలోమీటర్ల మేర నడిచిన ఆయన ఇక్కడే 200 రోజుల యాత్రను పూర్తిచేసుకున్నారు. రాష్ట్రంలో 13 జిల్లాలుండగా ఇంతవరకు తూర్పు గోదావరితో కలిపి 10 జిల్లాల్లో జగన్ పాదయాత్ర అప్రతిహతంగా సాగింది. తూర్పు గోదావరి జిల్లా పాదయాత్రలో అనేక సవాళ్ళు, ప్రతిసవాళ్ళతో జగన్ సాగారు. పెద్దాపురం నియోజకవర్గ పర్యటనలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు జనసేన శ్రేణులకు తీవ్ర ఆగ్రహం కలిగించాయి.
జగ్గంపేటలో కాపులకు బీసీ రిజర్వేషన్లు తన పరిధిలో లేవని, రిజర్వేషన్లు కేంద్రం పరిధిలోనివని చెప్పి కాపు జేఏసీ ఆగ్రహానికి గురయ్యారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దీనిపై తీవ్రంగా స్పందిస్తూ మరి కేంద్రం పరిధిలో ఉన్న ప్రత్యేక హోదా కోసం జగన్ ఎందుకు పోరాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాపుల నుండి వ్యతిరేకత పెల్లుబకడంతో పిఠాపురం బహిరంగ సభలో జగన్ కాపులకు అనుకూల ప్రకటన చేశారు.