ఆంధ్రప్రదేశ్‌

అమరావతి బాండ్లకు అనూహ్య స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 14: అమరావతి రాజధాని నిర్మాణానికి సంస్థాగత మదుపరుల నుంచి నిధుల సమీకరణకు ముంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారంపై అమరావతి బాండ్ల బిడ్డింగ్ ప్రక్రియ మొదలైన తొలి గంటలోనే భారీ స్పందన వచ్చింది. రూ. 1300 కోట్ల బాండ్లను బిడ్డింగ్‌కు ఉంచగా సంస్థాగత ఇనె్వస్టర్లు 2 వేల కోట్ల బాండ్ల కొనుగోలుకు ఆఫర్ ఇచ్చారు. ఒక రాజధాని నిర్మాణానికి నిధుల సమీకరణకు ఇలా 1.53 రెట్లు ఓవర్ సబ్ స్క్రయిబ్ కావడం రికార్డని ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్, స్పెషల్ కమిషనర్ వీ రామమనోహరరావు తెలిపారు. కనీసం రూ. 10 లక్షల పెట్టుబడి పెట్టగలిగే సంస్థాగత ఇనె్వస్టర్ల నుంచి వచ్చిన స్పందన చూసి వారు ఆనందం వ్యక్తం చేశారు. అమరావతి - 2018 పేరుతో విడుదల చేసిన బాండ్లు గంట వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రయిబ్ కావడం ఘన విజయమని ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ వ్యాఖ్యానించారు. దేశంలో ఇప్పటి దాకా విడుదలైన అన్ని మున్సిపల్ బాండ్లు కలిపి దాదాపు రూ. 1800 కోట్ల మేరకేనని, అమరావతి బాండ్లు 2వేల కోట్లకు ఓవర్ సబ్ స్క్రయిబ్ కావడం చారిత్రాత్మకమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశకత్వంలో అమరావతి నిర్మాణానికి ఇనిస్టిట్యూషనల్ బాండ్లను జారీ చేసిన విజయం సాధించామన్నారు. ఇదే ఉత్సాహంతో మరో 3 నెలల్లో రిటైల్ బాండ్లను జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అమరావతి నిర్మాణంలో పాలుపంచుకునేందుకు వీలుగా రిటైల్ బాండ్లు కనీసం రూ. 100 పెట్టుబడి పెట్టే విధంగా మార్కెట్‌లో జారీ చేస్తామని కమిషనర్ వివరించారు. అమరావతి తొలిదశ నిర్మాణ పనులకు రూ. 48 వేల కోట్లు అవసరమని, ప్రపంచ బ్యాంక్, హడ్కో వాణిజ్య బ్యాంకులు, మార్కెట్ బాండ్లు తదితర వనరుల ద్వారా నిధుల సమీకరణ జరుగుతోందని వివరించారు. ఇది అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ అయిన ముఖ్యమంత్రిపై నమ్మకానికి నిదర్శనమని ఏపీ సీఆర్‌డీఏ స్పెషల్ కమిషనర్ వీ రామ మనోహరరావు అన్నారు. పదేళ్ల బాండ్లకు 5 ఏళ్ల వరకు కేవలం వడ్డీ చెల్లిస్తే సరిపోతుందని ఆరో ఏట నుంచి వడ్డీ, అసలు వాయిదాల చెల్లింపులు చేయాల్సి ఉంటుందని వివరించారు. రిటైల్ ఇనె్వస్టర్లకు సంబంధించి బాండ్ల జారీకి కసరత్తుల చేస్తున్నామని, విధి విధానాలు, ఎన్ని నిధులు ఈ మార్గంలో సమీకరించాలనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.