ఆంధ్రప్రదేశ్‌

మూడు జిల్లాల్లో స్వజల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 14: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వజల్ పథకం అమలుకు విజయనగరం, విశాఖ, కడప జిల్లాలు ఎంపికయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. 2000 కోట్ల రూపాయలతో గ్రామాలకు లింక్ రోడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, చిత్తూరు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పథకాన్ని సెప్టెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులను అనుసరించారు. వెలగపూడి సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాస్పిరేషనల్ జిల్లాలుగా ఈ మూడు జిల్లాలను కేంద్రం ఎంపిక చేసిందన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నీటి పథకాలు లేని గ్రామాలకు 45 శాతం కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. స్వజల్ పథకంతో నీటి పథకాలను అనుసంధానం చేయాలన్నారు. అద్దంకి, చీమకుర్తి, కనిగిరి ప్రాంతాల్లో 86 నివాస ప్రాంతాలకు 5.28 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ సుజల ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. కుప్పం, ఉద్దానంలో వారం రోజుల్లో మిగిలిన డిస్పెన్సింగ్ యూనిట్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే 103 సుజల క్లస్టర్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సంవత్సరం మంచినీటి సరఫరా లేని గ్రామాలకు 900 కోట్ల రూపాయలతో నీటి సరఫరా పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో, వామపక్ష ఉగ్రవాద ప్రభావిత గ్రామాల్లో సౌరశక్తి ఆధారంతో ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు.
మంచినీటి సరఫరా పథకాల పర్యవేక్షణకి కొత్త యాప్‌ను రూపొందించాలన్నారు. వివిధ పథకాల పనితీరు తెలుసుకునే విధంగా యాప్‌ను రూపకల్పన చేయాలని తెలిపారు. 49,252 మంచినీటి పథకాల్లో పని చేస్తున్నవి 18226 మాత్రమేనని తెలిపారు. పని చేయని పథకాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని, ప్రతి 45 రోజులకు ఒకసారి పర్యవేక్షణ చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 900 పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఓడీఎఫ్ ప్లస్‌లో భాగంగా షేడ్‌ల ఏర్పాటు, గ్రీన్ అంబాసిడార్ల నియామకం, చెత్త సేకరణకు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేపట్టాలన్నారు. స్వచ్ఛ పర్యవేక్షణలో మొదటి 10 జిల్లాల్లో కనీసం ఐదు జిల్లాలు ఏపీకి చెందినవి ఉండేలా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు.
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న భూగర్భ డ్రైనేజీ పథకాన్ని సెప్టెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6347 అంగన్‌వాడీ భవనాల నిర్మాణం జరగాలన్నారు. 2 వేల కోట్ల రూపాయలతో గ్రామాలకు లింక్ రోడ్లను నిర్మిస్తున్నామని, 100 నుంచి 250 మంచి జనాభా ఉన్న గ్రామాలకు 790 కోట్ల రూపాయలతో, 100 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాలకు 413 కోట్లతో, 100 నుంచి 250 జనాభా ఉన్న గ్రామాలకు 717 కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు, 100 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాలకు 87 కోట్ల రూపాయలతో గ్రావెల్ రోడ్లు నిర్మించనున్నామని తెలిపారు. ఈఏపీ కింద ఇప్పటికే 4800 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి 3577 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. సరైన నిర్వహణ ద్వారా ఎక్కువ కాలం రోడ్లు ఉండేలా చూడాలన్నారు. రోడ్ల నాణ్యతను, రోడ్లపైన గుంతలను తెలుసుకునేందుకు లైడార్ టెక్నాలజీ, డ్రోన్లు ఉపయోగించి పైలట్ ప్రాజెక్టు చేపట్టాలన్నారు.