ఆంధ్రప్రదేశ్‌

సుందరీకరణ, అభివృద్ధి పనులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 16: ఎపీసీఆర్‌డీఏ పరిధిలోని దీవుల అభివృద్ధి, సుందరీకరణ ప్రాజెక్టులు, నగరాల అభివృద్ధిలో ఏ మాత్రం నిర్లిప్తత, జాప్యం లేకుండా పనులు వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన సీఆర్‌డీఏ అధికారులతో సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీ పరిసరాను ఆకర్షణీయంగా, సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. బ్యారేజీకి ఒకవైపున ఉన్న చిన్నకొండను అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, ఈ మేరకు ఒక ప్రణాళిక సిద్ధం చేసి, అమలు చేయాలన్నారు. ఈ ప్రాంతాన్ని పూలవనాలు, హరిత ప్రాంతంగా తీర్చిదిద్దాలన్నారు. బ్యారేజీ సుందరీకరణకు ప్రణాళిక సిద్ధం చేశామని, సీఎం సూచనల మేరకు త్వరలోనే అమలు చేస్తామని సీఎంకు అధికారులు తెలిపారు.
అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న 9 సిటీలను కూడా సీఎం సమీక్షించారు. తొమ్మిది సీటీల అభివృద్ధికి కమిటీలను ఏర్పాటు చేసి, సలహాలను తీసుకోవాలన్నారు. మీడియా సిటీ ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చించారు. ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో మీడియా సిటీ రూపొందాలన్నారు. మూవీ స్టూడియో ఉన్నత ప్రమాణాలతో 25 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వివరించారు. మీడియా సిటీ ప్రతిపాదనలపై తన ఆలోచనలను సినీ ప్రముఖుడు దగ్గుబాటి సురేష్‌బాబు వివరించారు. సినీ, టీవీ పరిశ్రమ ఇప్పటి వరకూ హైదరాబాద్‌కే పరిమితమైందని, అయితే ఏపీలోని నైపుణ్యతను, కళాకారులు, సాంకేతిక నిపుణులను, పూర్తిగా వినియోగించుకుంటే ఏడాదిన్నరలో పరిశ్రమ చక్కగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మీడియా సిటీలో సృజన, కంటెంట్‌పైనే అధారపడబోతోందని సీఎం తెలిపారు.
ప్రజల ఆలోచనలు, అవసరాలకు అనుగుణంగా కంటెంట్ అభివృద్ధి చేయల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.