ఆంధ్రప్రదేశ్‌

అవినీతిలోనే రాష్ట్రం అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ (జగదాంబ),జూలై 16: రాష్ట్రం కేవలం అవినీతి, అక్రమాలలో మాత్రమే అభివృద్ధి చెందిందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చి 1,500 రోజుల పాలనతో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమిలేదున్నారు. ఎన్నికల హామీల్లో ప్రకటించిన డ్వాక్రా మహిళల రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసి పథకాల పేర్లు మార్చి ఎన్టీఆర్ గృహాలుగా చెప్పుకోవడం సిగ్గుచేటున్నారు. కులాల అభివృద్ధి కోసం రూ.360 కోట్లు ఖర్చు చేశామని ప్రకటిస్తున్నారని, ఆయా నిధులను ఎక్కడ ఖర్చు చేశారో తెలియజేయాలన్నారు. విశాఖ కేంద్రంగా భాగస్వామ్య సదస్సులు నిర్వహించడంతో ఐదు నుంచి ఆరు లక్షల కోట్లు ఏపీకి పెట్టుబడుల వచ్చాయని ప్రకటించిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం 4,530కోట్లు మాత్రమే వచ్చిన విషయంలో వాస్తవాలు తెలపాలన్నారు. రామదాస్ అత్తావాలే అనే కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజులా వేరే పార్టీ నుంచి కేంద్ర మంత్రి అయ్యారని, ఆయన వైసీపీ నాయకులు బీజేపితో కలసి రావాలని మాట్లాడిన మాటాలపై మీరు దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇటీవల అమిత్‌షా హైదరాబాద్‌కు వచ్చి చంద్రబాబు రాజగురువును కలసి మంతనాలు చేసిన విషయంపై ఎందుకు మాట్లాడం లేదని ప్రశ్నించారు. విశాఖలో జరుగుతున్న భూకుంభ కోణాలపై సిట్ ద్వారా విచారణ చేసి ఆ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో విశాఖ రైల్వేజోన్‌కు సంబంధించి నలుగురు వ్యక్తులు కలసి వస్తే జోన్ తప్పక వస్తుందని, జోన్ సాధనకు మేము సిద్దమేనని, సవాల్ విసిరిన పవన్ కనిపించడం లేదున్నారు. వైసీపీని భూస్థాపితం చేస్తానని చంద్రబాబు అనటం హస్యాస్పదమన్నారు. కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఎవ్వరూ పోరాడినా వారికి తమ సంపూర్ణ మద్దతును తెలియజేస్తామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్దమేనన్నారు. సమావేశంలో వైసీపీ నాయకులు తైనాల విజయ్‌కుమార్, గుడివాడ అమర్‌నాథ్ పాల్గొన్నారు.