తెలంగాణ

చేపల అమ్మకాలకు మొబైల్ ఔట్‌లెట్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: తెలంగాణలో మస్తుగా చేపల అభివృద్ధికి అవసరమైన నిధులు పుష్కలంగా ఉన్నాయని నేషనల్ ఫిషరీష్ డెవలప్‌మెంట్ బోర్డు సిఈఓ రాణికుముదినిదేవి తెలిపారు. బుధవారం సచివాలయంలో మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో కలసి చేపల అభివృద్ధిపై చర్చించారు. చేపల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఎన్‌ఎఫ్‌డిబి పూర్తి సహకారం అందిస్తుందని ఆమె భరోసా వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో ఉన్న 150 డివిజన్లలో నాణ్యమైన చేపల అమ్మకాల కోసం ప్రత్యేకంగా మొబైల్ ఔట్‌లెట్‌లను ఏర్పాటు చేస్తున్నామని అందుకోసం టెండర్లను ఆహ్వానిస్తుట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మత్స్య సంపదను పెంచడానికి మరిన్ని నిధులను రాబట్టడానికి కేంద్రానికి సమగ్రంగా నివేదికలు తయారు చేయాలని సంబంధిత అధికారులను పురమాయించారు. చేపల పెంపకం, అమ్మకాల వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయన్నారు. త్వరలో హేచరీస్ నిర్వాహకులు, జిల్లా సొసైటీల సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు.
2018-19 సంవత్సరంలో 24,192 నీటి వనరులలో దాదాపు 77 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాంలో 10 జిల్లాల్లో 40 చేపల మార్కెట్లను అభివృద్ధి చేయాలని ప్రణాళికలను రూపొందించామన్నారు. సమావేశంలో మత్స్యశాఖ సెక్రటరి సందీప్‌కుమార్ సుల్తానియా, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ పాల్గొన్నారు.