తెలంగాణ

రమణ దీక్షితులు ఆరోపణలపై సీబీఐ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న వ్యవహారాలపై ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందో చెప్పాలని వీహెచ్‌పీ తెలంగాణ కమిటీ డిమాండ్ చేసింది. విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, వెంటనే ప్రస్తుత అధికారులను, బోర్డును తొలగించాలని, రికార్డులను సీజ్ చేసి సిబిఐ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఎవరు లాభపడతారో చూడటం కంటే తిరుమల తిరుపతి పవిత్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. సిబిఐ విచారణ జరిపిస్తే నిజాలు నిగ్గుతేలుతాయని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. టీటీడీ ఈవో ఇచ్చిన వివరణపై కూడా భక్తులను అనుమానాలు రేకేతుతున్నాయని అన్నారు.
పెట్రోలు, డీజిలు ధరలను సర్కారు నియంత్రించాలి
హైదరాబాద్, మే 21: పెట్రోలు, డీజిలు ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎఐసిసి సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ చైర్మన్ కనుకుల జనార్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. పెట్రోలు, డీజిలు ధరలను పెంచి ప్రజల నడ్డివిరిచిందని ఆయన సోమవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధరలను అరికట్టామని, ఎప్పుడైనా పావులా పెరిగితే బిజెపి నాయకులు గగ్గోలు పెట్టేవారని ఆయన గుర్తు చేశారు. 2008 జూలైలో క్రూడ్ ఆయిల్ ధర 147 డాలర్లు ఉండగా, అప్పుడు పెట్రోలు ధరల లీటరుకు రూ.54 ఉందని, 2018 ఏప్రిల్‌లో క్రూడాయిల్ ధర 68 డాలర్లు ఉంటే, పెట్రోలో ధరల రూ.79.08కి పెరిగిందని తెలిపారు. కర్నాటక ఎన్నికల ఫలితాల అనంతరం భారీగా ధరలు పెంచేశారని ప్రస్తుత పెట్రోలు ధర హైదరాబాద్‌లో రూ.81.11గా, డీజిల్ ధర రూ. 73.72గా ఉందని ఆయన తెలిపారు. వ్యవసాయం, ప్రజా రవాణా డీజిల్‌పై ఆధారపడి ఉందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ సేవాదళ్ తరపున 23న ఆందోళన చేపట్టనున్నట్లు కనుకుల తెలిపారు.