తెలంగాణ

టిఎస్‌పిఇ సెట్ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: తెలంగాణ రాష్ట్ర వ్యాయామ కళాశాలల్లో బి.పి.ఇడి, డి.పి.ఇడి కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన టిఎస్‌పిఇసెట్-2018 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావు, సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వి సత్యనారాయణలు విడుదల చేశారు. బి.పి.ఇడిలో వరంగల్ జిల్లా పసరగొండకు చెందిన మామిడిపెల్లి కరుణాకర్ టాపర్‌గా నిలవగా, రెండోస్థానంలో నిజామాబాద్‌కు చెందిన గుడుగుల కళ్యాణి నిలిచారు. ఇక డి.పి.ఇడిలో భూపాల్‌పల్లి కృష్ణాపురానికి చెందిన ఉస్కలేటి మధురుత టాపర్‌గా నిలవగా, రెండోస్థానంలో బదావత్ అనిత నిలిచారు. బి.పి.ఇడికి 2011 మంది పురుషులు, 611 మంది మహిళలు రిజిస్టర్ చేసుకోగా, శారీర దారుఢ్యపరీక్షలకు 1600 మంది పురుషులు, 441 మంది మహిళలు హాజరయ్యారు. వారిలో 1548 మంది పురుషులు, 407 మంది మహిళలు ఉత్తీర్ణులయ్యారు. ఇక డిపిఇడిలో 1664 మంది పురుషులు, 688 మంది మహిళలు హాజరుకాగా, వారిలో 1243 మంది పురుషులు, 509 మంది స్ర్తిలు అర్హత సాధించారు. అర్హత సాధించిన వారందరికీ ర్యాంకులను కేటాయించినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ వి సత్యనారాయణ తెలిపారు. త్వరలోనే వీరందరికీ అడ్మిషన్ల కౌనె్సలింగ్ మొదలువుతుందని చెప్పారు.
టాపర్లు వీరే..
బి.పి.ఇడి: 1. ఎం. కరుణాకర్ 2. జి. కళ్యాణ్ 3. ఎ. ఉమారాణి 4. జె. సౌజన్య 5 బి. ఉషారాణి 6. ఎల్. ఉష 7. ఐ. శ్రీను 8. పోలేపాక మంజుల 9. సి. స్వాతి 10. జె. రిషిక
డిఇడి: 1 యు. మధురుత 2. బి. అనిత 3. టి. నవ్య 4. పి. చంద్రకళ 5. జె. నవీన్ 6. జి. అరుణ 7. ఎల్. కృప 8. పి. వౌనిక 9. పి. అనుష 10. జె. అఖిల.