తెలంగాణ

గాంధీ కుటుంబాన్ని మరుగుపరిచే కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం రాజీవ్ 27వ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించారు. సోమాజీగుడాలోని రాజీవ్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూల దండలువేసి నివాళి అర్పించారు. ఏఐసీసీ నాయకుడు, మాజీ ఎంపీ వి. హనుమంత రావు ఉగ్రవాద వ్యతిరేక దినంగా ఏర్పాటు చేసిన సభలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు. ఉగ్రవాదులు వారి దేహాలను ముక్కలు చేసినా గాంధీ కుటుంబం దేశం కోసమే పని చేస్తున్నదని ఆయన చెప్పారు. అయితే గాంధీ కుటుంబం చరిత్రను భావితరాలకు తెలియకుండా చేసేందుకు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆయన విమర్శించారు. ప్రపంచంలోని గొప్ప నేతల్లో రాజీవ్ ఒకరని ఆయన తెలిపారు. రాజీవ్ ప్రధానిగా ఉన్నప్పుడు అనేక విప్లవాత్మక, చారిత్రక నిర్ణయాలు చేశారని, యువత రాజకీయాల్లో చురుగా పాల్గొనేలా చర్యలు చేపట్టారని, సాంకేతిక విప్లవం సృష్టించారని ఆయన కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని, రాష్ట్రంలోని టిఆర్‌ఎస్‌ను ప్రజలు తరిమికొట్టి, కాంగ్రెస్‌కు అధికారం అప్పగించనున్నారని ఉత్తమ్ అన్నారు. ఏఐసీసీ నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు ప్రసంగిస్తూ మతతత్వ పార్టీ బీజేపీని, అవినీతి, నియంతలా వ్యవహారిస్తున్న టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.

గాంధీ భవన్‌లో..
గాంధీ భవన్‌లో రాజీవ్ చిత్ర పటానికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మండలి విపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి తదితరులు పూల దండ వేసి నివాళి అర్పించారు.

సాలిడారిటీ కమిటీ అధ్వర్యంలో..
ఇలాఉండగా నేషనల్ సాలిడారిటీ కమిటీ అధ్వర్యంలో ప్రకాశం హాలులో రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహించారు. కమిటీ చైర్మన్ ఎస్‌కె అఫ్జలుద్దీన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి, ఎంపి కె.వి.పి. రామచందర్ రావు పాల్గొన్నారు.