తెలంగాణ

29న జేఈఈ అడ్వాన్స్‌డ్ కీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: జేఈఈ అడ్వాన్స్‌డ్ కీ ఈ నెల 29న విడుదల చేయనున్నారు. అంతకంటే ముందే అభ్యర్ధులకు మే 25 ఉదయం 10 గంటలకు రెస్పాన్స్ షీట్లను పంపిస్తారు. వీటిని సరిపోల్చుకునేందుకు ఆన్‌లైన్ టెస్టు పేపర్లను ఇప్పటికే జేఈఈ అడ్వాన్స్‌డ్ వెబ్ పోర్టల్‌లో ఉంచారు. ఫస్టు పేపర్‌కు 1,57,496 మంది హాజరుకాగా, సెకండ్ పేపర్‌కు 1,55,091 మంది హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 573 కేంద్రాల్లో నిర్వహించిన అడ్వాన్స్‌డ్ పరీక్షకు దాదాపు 17వేల మంది హాజరుకాలేదు. తొలి పేపర్‌కు 7326 మంది, రెండో పేపర్‌కు 9731 మంది గైర్హాజరయ్యారని ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ షాలబ్ చెప్పారు. తొలి కీపై అభ్యర్థుల అభ్యంతరాలను ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటల నుండి మే 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ స్వీకరిస్తారు. అనంతరం తుది కీ రూపొందించి ఫలితాలను ప్రకటిస్తారు.
గురుకుల క్రాఫ్ట్ టీచర్ల పోస్టులకు
మరో 43 మందికి అవకాశం
గురుకులాల్లో క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు వివిధ క్యాటగిరిల్లో ఖాళీగా ఉన్న 43 పోస్టులకు దాదాపు 86 మందిని సర్ట్ఫికేట్ల పరిశీలనకు ఆహ్వానిస్తున్నట్టు పబ్లిక్ సర్వీసు కమిషన్ పేర్కొంది. వీరంతా మే 26వ తేదీ ఉదయం 10.30 గంటలకు కమిషన్ కార్యాలయంలో హాజరుకావాలని పేర్కొంది.
ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్‌లో విద్యార్థుల ప్రతిభ
గురుకులాల్లో చదివిన విద్యార్ధులు ఇటీవల నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్‌లో ప్రతిభ కనబరిచారని గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. తొలి ర్యాంకు సాధించిన కే మధురిత భద్రాచలం గిరిజన సంక్షేమ గురుకులంలో చదువుకుందని, అలాగే నాలుగో ర్యాంకు సాధించిన పాయం చంద్రకళ, 9వ ర్యాంకు సాధించిన అనూషలు కూడా గురుకుల వి ద్యార్థులేనని ఆయన చెప్పారు. అథ్లెటిక్స్‌లో జాతీయ స్థాయిలో పాల్గొని పతకాలు సాధించిన వీరు భవిష్యత్‌లో వ్యాయామ ఉపాధ్యాయులు కావడం హర్షణీయమన్నారు.