తెలంగాణ

అక్రమాలకు అవకాశమివ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: ‘ప్రజల అభీష్టం మేరకు చిత్తశుద్ధితో విధి నిర్వహణ చేయాలని, అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా పనులు వేగంగా జరిగేలా చూడాలి. ఎక్క డా అక్రమాలకు అవకాశం ఇవ్వొద్దు’ అని కొత్తగా నియామకమైన గ్రూప్-1 అధికారులకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహ రి సూచించారు. గ్రూప్-1 సర్వీసులకు ఎంపికైన అధికారులకు ఆరు వారాల పా టు ఇచ్చే శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో ప్రారంభించారు. తెలంగాణ రా ష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 15 శాఖలకు ఎంపికైన 61 మంది అధికారులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపడుతోందని, వీటిని ఈ వర్గాలకు అందేలా ప్రతి ఒక్క అధికారి పాటుపడాలని సూచించారు. సరై న సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే విపరీత పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారులు బాగా పనిచేసి ప్రభుత్వానికి పేరు తేవాలన్నారు. ప్రజలకు సులభమైన పరిపాలన అందించేందుకు కొత్త అధికారులు పనిచేయాలని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు పనులపై వస్తుంటారని, వారి సమస్యలను వేగంగా పరిష్కరించాలని, కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ లేకుం డా చూడాలన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి సూచించారు. సో షల్ మీడియా నేడు కీలకంగా మారిందని, ఏ అధికారి సరిగ్గా పనిచేయకపోయి నా, ఇక్కట్లు వస్తాయన్నారు. అధికారులు నిరంతరం విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్ బీపీ ఆచార్య పేర్కొన్నారు. గ్రూప్-1 అధికారులకోసం రూపొందించిన స్టడీ మెటీరియల్, డిజిటల్ కాపీలను కడియం శ్రీహరి, కేటీఆర్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి శాలినీ మిశ్రా, కాలేజియేట్ కమిషనర్ నవీన్ మిట్టల్, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ (శిక్షణ) ఎస్‌ఎం నబీ తదితరులు మాట్లాడారు.