తెలంగాణ

ఇది ఆరంభమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: ప్రాంతీయ పార్టీల పవరేంటో భవిష్యత్తులో చూస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. కర్నాటకలో జరిగిన పరిణామాలు ఆరంభం మాత్రమేనన్నారు. కర్నాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న కుమారస్వామికి దేవుడి దీవెనలు ఉంటాయన్నారు. కర్నాటక ముఖ్యమంత్రిగా జనతాదళ్ ఎస్ నేత కుమారస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారమే సీఎం కేసీఆర్ బెంగళూరు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు, కలెక్టర్లతో బుధవా రం అత్యవసర సమావేశం ఉండటంతో ప్రమాణ స్వీకారానికి ముందు రోజు మంగళవారమే హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లిన కేసీఆర్, కుమారస్వామికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో కేసీఆర్ మాట్లాడుతూ, ప్రాంతీయ పార్టీల పవరేం టో భవిష్యత్‌లో చూస్తారని పునరుద్ఘటించారు. కర్నాటక ఎన్నికలు ఆరంభం మాత్రమేనన్నారు. తనకు బుధవారం హైదరాబాద్‌లో అత్యవసర సమావేశం ఉండటం వల్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్టు కూడా కేసీఆర్ తెలిపారు. ఇలా ఉండగా బేగంపేట విమానాశ్రయం నుంచి మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీలు కే కేశవరావు, వినోద్‌కుమార్, సంతోష్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సీ లక్ష్మారెడ్డితో పాటు సీఎం కేసీఆర్ బెంగళూరు వెళ్లారు. అక్కడికి చేరుకున్నాక కేసీఆర్ నేరుగా మాజీ ప్రధాని దేవెగౌడ ఇంటికి వెళ్లగా దేవెగౌడతో పాటు ఆయన కుమారులు కుమారస్వామి, రేవణ్ణ సాదర స్వాగతం పలికారు. కర్నాటకకు కాబోయే సీఎం కుమారస్వామికి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శాలువతో కేసీఆర్ సత్కరించారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో కేసీఆర్ తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు.