తెలంగాణ

నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: నల్లగొండ, సూర్యాపేటలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వైద్య, ఆరోగ్యశాఖ ఈ మేరకు చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం ఆమోదం తెలిపినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఈ రెండు మెడికల్ కాలేజీలకు 150 చొప్పున సీట్ల కేటాయింపునకు సీఎం ఆమోదించారు. ఇప్పటికే ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న సిద్దిపేట మెడికల్ కాలేజికి 150 సీట్లు మంజురు చేసినట్టు సీఎం పేర్కొన్నారు.