తెలంగాణ
దత్తాత్రేయకు ప్రధాని పరామర్శ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, మే 23: కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ (21) బుధవారం వేకువజామున హఠాన్మరణం చెందడంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర సంతాపాన్ని తెలిపారు. దత్తాత్రేయకు టెలిఫోన్లో పరామర్శించి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. వైష్ణవ్ హఠాన్మరణంపై కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్, ఇతర పార్టీలతో సహా బీజేపీ నాయకులు తీవ్ర సంతాపాన్ని , దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న వైష్ణవ్ రాత్రి 10 గంటల సమయంలో భోజనం చేస్తూ కుర్చీలోనే కుప్పకూలారు. దాంతో కుర్చీతో సహా కింద పడిపోయారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ముషీరాబాద్‌లో ఉన్న గురునానక్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక వైద్య బృందం దాదాపు రెండు గంటల పాటు శ్రమించినా ఫలితం లేకపోయింది. దాంతో అర్ధ రాత్రి దాటిన తర్వాత వైష్ణవ్ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. హృద్రోగంతో ఇబ్బంది పడుతున్న దత్తాత్రేయ దంపతులకు కుటుంబ సభ్యులు ఆ రాత్రి వైష్ణవ్ మృతి విషయాన్ని తెలియజేయలేదు. ఉదయం ఐదుగంటలకు విషాదవార్త విని దత్తాత్రేయ కన్నీరుమన్నీరై తల్లడిల్లిపోయారు. ఇక కుమారుడు లేడని తెలుసుకుని శోకసముద్రంలో మునిగిపోయారు. వైష్ణవ్ మృతదేహాన్ని తెల్లవారుజామున దత్తాత్రేయ ఇంటికి తరలించారు. అనేక మంది బీజేపీ నేతలు వచ్చి వైష్ణవ్ పార్థీవ దేహాన్ని సందర్శించారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామమోహన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, జి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు తదితరులు దత్తాత్రేయ కుటుంబాన్ని పరామర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు వేర్వేరు ప్రకటనల్లో దత్తాత్రేయకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ వైష్ణవ్ మృతి పట్ల తీవ్ర విచారాన్ని , దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ విషాద వార్తతో తనకు మాటలు రావడం లేదని, భగవంతుడు దత్తాత్రేయ కుటుంబానికి అండగా నిలవాలని అన్నారు. టీడీపీ టీఎస్ అధ్యక్షుడు ఎల్ రమణ, పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి, కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వేర్వేరు ప్రకటనల్లో తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బంధువుల సమక్షంలో వైష్ణవ్ మృతదేహానికి బుధవారం సాయంత్రం అంతిమసంస్కారం నిర్వహించారు.