తెలంగాణ

కులవృత్తులకు చేయూతనిస్తున్న కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: కులవృత్తులపై జీవనం సాగిస్తున్న కుటుంబాలకు కెసిఆర్ చేయూతను ఇస్తారని మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారు. మంగళవారం సచివాలయంలో గంగపుత్ర, ముదిరాజ్ సంఘాలకు చెందిన రాజ్యసభ సభ్యులతో పాటు పలువురు నేతలు మంత్రి తలసానితో చర్చలు జరిపారు. తెలంగాణా ఏర్పడిన తర్వాత కులవృత్తుల కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానకి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న కులవృత్తుల కుటుంబాలు ఆర్థికంగా బలపడాలని ముఖ్యమంత్రి వినూత్న పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. గంగపుత్ర, ముదిరాజులకు ఈ యేడాది రూ. 51 కోట్ల రూపాయలతో చేప పిల్లలను పెంచడానికి అవకాశం ఉందన్నారు. చెరువులపై దళారీల పెత్తనం పోగొట్టడానికే ఆయా కుటుంబాల వద్దకు సొసైటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మత్య్స సంపదపై ఆయా వర్గాల వారికే ప్రాధాన్యత ఉంటుందని వీటిపై కొందరు అనవసరంగా విభేదాలు సృష్టంచడం మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో ముదిరాజ్, గంగపుత్ర సంఘాల నేతలు లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, విజయకుమార్, వెంకటేష్, సాయికిరణ్, ధనరాజు, వరలక్ష్మీ తదితరులు ఉన్నారు.