తెలంగాణ

పంట రుణాలు రైతులకు అందేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: తెలంగాణలో రైతులు ఇప్పుడు పంటల పెట్టుబడికి పెద్ద సమస్య ఎదుర్కొంటున్నారు. 2018 ఖరీఫ్ సీజన్‌లో పంట రుణాలను బ్యాంకులు ఇస్తాయా? లేదా? అన్నదే ఈ సమస్య. రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) ఇప్పటి వరకు పంటల కోసం రుణప్రణాళికను ఖరారు చేయలేదు. బ్యాంకులు ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. 2018-19 సంవత్సరానికి రుణప్రణాళిక రూపొందించకపోవడానికి నగదు సంక్షోభం ప్రధానమైన కారణమనిపిస్తోంది. రైతుబంధు పథకం కింద డబ్బు తెలంగాణ మొత్తంలో 5800 కోట్ల ఇచ్చేందుకే బ్యాంకులు నానా తంటాలు పడ్డాయి. బ్యాంకులకు కరెన్సీ అందుబాటులో ఉంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి గత ఆరు నెలల నుండి ప్రయత్నిస్తూ వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కోరిక మేరకు భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బీఐ) రాష్ట్రంలోని బ్యాంకులకు నగదు నిలువలు చేరేలా చర్యలు తీసుకున్నది. ఈ నేపథ్యంలో కూడా చాలా ప్రాంతాల్లో బ్యాంకర్లు రైతుబంధు పథకం కింద చెక్కులను నగదుగా మార్చుకునేందకు తమ వద్ద డబ్బు లేదని ఖరాఖండీగా చెబుతున్నారు. దాంతో రైతులు మానసిక క్షోభకు గురవుతున్నారు. ఈ పరిస్థితిలో పంటలకోసం బ్యాంకులు రైతులకు ఖరీఫ్ రుణాలు సమకూరుస్తాయా అన్నది చర్చనీయాంశంగా మారింది.
పంటల పెట్టుబడికి తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు 4000 రూపాయలు రైతుబంధు పథకం కింద ఇచ్చింది. అయితే ఈ నిధులు రైతులకు సరిపోవు. ఒక్కో పంటకు ఒక్కో విధంగా పెట్టుబడి అవసరం ఉంటుంది. ఉదాహరణకు వరి పంటకు ఎకరానికి 25 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. అలాగే మక్కజొన్నకు 22 వేలు, పత్తికి 50 వేల రూపాయలు, పసుపుపంటకు 80 వేల రూపాయలు, చెరకుపంటకు లక్ష రూపాయలు అవసరం అవుతుంది. ఆ యా ప్రాంతాలను, భూమి రకాన్ని బట్టి ఈ పెట్టుబడి కొద్దిగా పెరగవచ్చు, తగ్గనూ వచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అంటే ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఇచ్చిన నిధులకు తోడుగా ఇంకా పెట్టుబడి అవసరం ఉంటుంది. రైతులవద్ద డబ్బు ఉంటే పెట్టుబడి పెడతారు, లేకపోతే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, లేదా ప్రైవేట్ వడ్డీవ్యాపారుల నుండి రుణాన్ని తీసుకోవాల్సి వస్తోంది. బ్యాంకులే కరెన్సీ సంక్షోభంలో మునిగి ఉంటే రైతులకు పంట రుణాలను మంజూరు చేస్తాయా అన్నది అనుమానంగా ఉంది. 2016-17 లో పంటరుణాలుగా 29 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, 25 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వగలిగారు. 2017-18 లో కూడా పంట రుణాలుగా 39 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని లక్షంగా పెట్టుకోగా, ఈ మొత్తాన్ని చేరుకోలేదు. 2018-19 సంవత్సరంలో ఎస్‌ఎల్‌బీసీ సమావేశమై నిర్ణయం తీసుకుంటే తప్ప రుణప్రణాళిక ఎంతో తేలే అవకాశం లేదు. ఎస్‌ఎల్‌బీసీ సమావేశం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.