తెలంగాణ

బంగారు తెలంగాణలో ఇంజనీర్లు భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: కోటి ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారం చేయడంలో ఇంజనీర్లు భాగస్వామ్యం కావాలని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. నీటిపారుదలశాఖలో 300 మంది సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు మంత్రి బుధవారం నియామక పత్రాలను అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువ ఇంజనీర్లకు తెలంగాణ తల్లి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందన్నారు. తమ సామార్ధ్యాన్ని నిరూపించుకోవడంతో పాటు నాణ్యతతో కూడిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. నీటిపారుదలశాఖలో పని చేయడం సవాల్‌తో కూడుకుందని, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. శ్రీరామ్‌సాగర్, నాగార్జునసాగర్, మూసీ, లోయర్ మానేరు పరిధిలో చిట్టచివరి భూములకు నీరు అందించి చరిత్ర సృష్టించామన్నారు. ఈ శాఖలో పని చేసే వారికి లక్షలాది మంది ఇంజనీర్ల దీవెనలు దక్కుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4వ విడతగా ఇంజనీర్ల నియామకం జరిగిందని, ఇప్పటి వరకు 686 ఇంజనీర్లను కొత్తగా నియమించామన్నారు. క్షేత్రస్థాయిలో పని చేయడానికి మహిళా ఇంజనీర్లు కూడా ముందుకు రావడం అభినందనీయమని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. ఇలా ఉండగా కాకతీయ మీడియా అవార్డులను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రదానం చేసారు.