తెలంగాణ

యాదాద్రి అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, మే 23: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పునః నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, యాదాద్రి తెలంగాణలో మరో తిరుపతిగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారుతుందని దేవాదాయశాఖ మంత్రి కె. ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్ర పునః నిర్మాణ పనులపై బుధవారం యాదగిరిగుట్టపై గల హరిత అతిథిగృహంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డిలతో కలిసి వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ఆలయ ఈవో గీతారెడ్డి, ఇంజనీరింగ్, ఆర్కిటెక్, స్థపతులు రవీందర్, గణపతిరెడ్డి, వసంతనాయక్, తదితర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆలయ పునః నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో చర్చించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పనులపై కొన్ని సూచనలు చేశారు. సమావేశం అనంతరం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి చేరుకోగా ఆలయ ఈవో, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికగా స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు మంత్రికి ఆశీర్వచనం చేశారు. ఈవో, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ప్రధాన ఆలయ అభివృద్ధి పునః నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిసర ప్రాంతంలో కలియతిరిగి పర్యవేక్షించారు. ఆలయ నమూనా పటాన్ని అధికారులు చూపి వివరాలు మంత్రికి తెలియజేశారు. ఆలయ పునః నిర్మాణ పనులు ప్రారంభమై వచ్చే విజయదశమి నాటికి రెండేళ్లు అవుతుంది. యాదాద్రి ఆలయ పునఃనిర్మాణ పనులపై ప్రతినెలా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ప్రారంభంలో పనులు కొంత నెమ్మదిగా సాగాయని, తరువాత వేగం పుంజుకొని తాము అనుకున్న స్థాయిలో పనులు జరుగుతున్నాయన్నారు. ఎండలోకూడా ఆలయ నిర్మాణం కోసం కార్మికులు చాలా కష్టపడుతున్నారని తెలిపారు. ఇప్పటివరకు తూర్పు, ఉత్తర దిశ గోపురాలు పూర్తి కావస్తున్నాయని, మిగిలిన ఐదు గోపురాలతో పాటు ప్రధాన ఆలయం, ఆలయ ప్రాకారాలు సెప్టెంబర్ చివరినాటికి పూర్తి చేస్తామన్నారు. అదేవిధంగా జూలైలో శివాలయ నిర్మాణం కూడా పూర్తవుతుందని తెలిపారు. ఆలయ పనులు దసరా నాటికి మొత్తం పూర్తి చేసి ముఖ్యమంత్రి కేసీ ఆర్ నిర్ణయం మేరకు ఆలయాన్ని భక్తులకు దర్శనాలు ప్రారంభిస్తామన్నారు. వేల సంవత్సరాలు నిలిచి ఉండేలా ఆలయ పునః నిర్మాణం ఉండాలని, కావున పనులపై తొందరపాటు చర్యలు ఉండకూడదని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆయత చండీయాగం ఎంత పవిత్రంగా చేశారో, ఆలయ నిర్మాణ పనులు కూడా అంతే పవిత్ర సంకల్పంతో చేపడుతున్నారన్నారు. ఆలయ పునః నిర్మాణ పనులను జూలై మరోమారు పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, వైటీడీఏ అధికారులు, ఆర్కిటెక్ ఇంజనీరింగ్ అధికారులు, ఆలయ అధికారులు ఉన్నారు.