తెలంగాణ

బీజేపీతోనే భారత్‌కు భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: భారతదేశానికి బీజేపీతోనే భవిష్యత్ ఉంటుందని, స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత మచ్చలేని పాలనను బీజేపీ అందించిందని, దీనిని తట్టుకోలేకనే విపక్షాలు అన్నీ ఒకే గొడుగు కిందకు వస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాలుగేళ్ల పాలన సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ పాలన సాగుతోందని, బీజేపీ జైత్ర యాత్ర దక్షిణాదిన కర్నాటకతో మొదలైందని, తదుపరి లక్ష్యం ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలేనని అన్నారు. 2022 నాటికి నూతన భారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ పనిచేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా రాం మాధవ్ అనేక అంశాలను ప్రస్తావించారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్‌ను మేనేజ్ చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏం మేనేజ్ చేస్తారని ప్రశ్నించారు. పారదర్శకత, జవాబుదారీతనాన్ని బీజేపీ నమ్ముతుందని నాలుగేళ్లలో తాము ఏం సాధించామో ధైర్యంగా ప్రజల ముందు చెప్పగలుగుతున్నామని అన్నారు. మోదీ విజయాలతో విపక్షాలు నిస్సహాయ, అసహాయ స్థితిలో పడ్డాయని, మంచి పనులు చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. అవినీతి లేని స్వచ్ఛమైన పాలన అందించిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని అన్నారు. తప్పుడు రాజకీయ సంస్కృతికి అలవాటు పడిన వారే కూటమిలను ఏర్పాటు చేస్తున్నారని , అవినీతి రహిత, వంశపారంపర్య రహిత రాజకీయాలతో నూతన రాజకీయ సంస్కృతిని మోదీ నిర్మిస్తుంటే దానిని చూసి ఓర్వలేకపోతున్నారని చెప్పారు. మూడేళ్లు సంసారం చేసిన చంద్రబాబు షిప్‌లో నుండి సముద్రంలో దూకారని ఆయన పరిస్థితి ఇపుడు దారుణమని అన్నారు. ఆంధ్రాలో అవినీతి గర్భగుడి వరకూ వెళ్లిందని, దేవుళ్లకు కూడా కులాలను అంటగడుతున్నారని ఆరోపించారు.
తాము దేశాన్ని ఐకమత్యంగా ఉంచడం, శక్తివంతంగా మార్చడం, ప్రతి భారతీయుడికి గౌరవాన్ని సమకూర్చడం, ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టం చేయడం లక్ష్యంగా ప్రధాని నూతన భారత్ నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. సభకు ఎంఎల్‌సి ఎన్ రామచందర్ రావు అధ్యక్షత వహించారు. సభలో డాక్టర్ కే లక్ష్మణ్, ఎన్ రామచందర్‌రావు, ప్రొఫెసర్ వైకుంఠం, ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి మాట్లాడగా, టి హనుమాన్ చౌదరి, కరుణా గోపాల్, డాక్టర్ రమేష్, యోగానంద్, జి కిషన్‌రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి , దినేష్‌రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం తదితర నాయకులతో పాటు వేలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.