తెలంగాణ

తెలుగు భాష పరిరక్షణకు కేసీఆర్ కృషి అమోఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: తెలుగు భాషను పరిరక్షించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి అమోఘమని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు 75 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా శనివారం నిర్వహించిన సప్తతి మహోత్సావనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సారస్వత పరిషత్‌కు పెద్ద చరిత్ర ఉందని, మహోత్సావాల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. నానాటికీ ప్రజల్లో ఆంగ్లభాష వ్యామోహం అధికం అవుతోందని అది ఎంత మాత్రం సరికాదన్నారు. ఆంగ్ల భాష వస్తేనే ఉద్యోగం, ఉపాధి అవకాశాలు వస్తాయనే భావనలో ప్రజలు ఉన్నారని అన్నారు. తెలుగు భాషలందు తెలుగు లెస్స అని, ఎన్ని భాషలు నేర్చుకున్నా అమ్మభాషను మరిచిపోవడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదని అన్నారు. విదేశాల్లో జీవిస్తున్న వారు మాతృభాషను బతికించుకునేందుకు ప్రయత్నిస్తుంటే ఇక్కడి వారు ఆధునికత పేరుతో అమ్మభాషను దూరం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాతృభూమిని, కన్నతల్లిని, మాతృభాషను మరవడానికి మించిన అపరాధం వేరొకటి ఉండదని అన్నారు. ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో మధురమైన తెలుగుబాషలో మాట్లాడాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా సారస్వత పరిషత్తు ప్రచురించిన పుస్తకాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ సలహాదారుడు కేవీ. రమణాచారిలతో కలిసి ఆయన ఆవిష్కరించారు.