తెలంగాణ

వందేళ్లకు వచ్చిన పర్వదినం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* తరలివచ్చిన భక్త జనం!
నల్లగొండ, ఏప్రిల్ 16: చారిత్రాత్మక నల్లగొండ పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయం సోమవారం భక్తుల రద్ధీతో కిటకిటలాడింది. సోమవారం, మాస శివరాత్రి, అమావాస్య మూడూ ఒకేరోజున కలిసి రావడం.. ఛాయా సోమేశ్వర పుష్కరణిలో స్నానమాచరించి స్వామివారిని కొలిచిన పక్షంలో సర్వదోషాలు తొలగిపోతాయని ప్రచారం జరగడంతో భక్తులు పోటెత్తారు. ఈ విధంగా వందేళ్లకోసారి వస్తుందని ఓ టీవీ చానల్ వెల్లడించింది. దీని ప్రభావమా అన్నట్లు భక్తులు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు నుంచి సైతం వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. రెండు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. కాకతీయుల సామంతులు చోడ రాజులు నిర్మించిన ఈ త్రికుటాలయంలో ఆలయ స్తంభాల నీడ ఏకస్తంభ నీడ (్ఛయ)గా నిరంతరం నిశ్చలంగా శివలింగంపై కప్పబడి ఉంటుండటంతో ఛాయ సోమేశ్వర ఆలయంగా ప్రఖ్యాతినొందింది. మహాశివుడిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించేందుకు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు మంచినీరు, ప్రసాదాలు అందించారు. పలాసా ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు.