తెలంగాణ

సామాన్యుల కష్టాలు కేసీఆర్‌కు తెలుసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెట్‌పల్లి రూరల్, ఏప్రిల్ 16: సామాన్య ప్రజల కష్టా లు ముఖ్యమంత్రి కేసిఆర్‌కు తెలుసని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం మండలంలోని మెట్లచిట్టాపూర్ గ్రామంలో రూ. 16 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఎంపి కవిత ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపి మాట్లాడుతూ సీఎం కేసిఆర్ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చారని, పేద ప్రజల సాధక బాధకాలు సీఎం కేసీఆర్‌కు తెలుసని, సామాన్య ప్రజల సంక్షేమం కోసం సీఎం నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు నీళ్లు, కరెంటు, వనరులు, ఉద్యోగాలు, ఇలా ఎన్నోగత ఆంధ్రపాలకులు దోచుకోవడమే కాకుండా, తెలంగాణ ప్రజలు కక్కిన పన్నుతో ఆంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుని తెలంగాణ ప్రాంతంలో వివక్ష చూపించారన్నారు. తెలంగాణ సాధన అనంతరం ప్రజలకు, సాగునీరు, తాగునీరు, పేదప్రజలకు డబుల్‌బెడ్‌రూంలు, అర్హులైన వారికి పెన్షన్లు అందిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందుంచారన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయం గా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని, గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి ఎంపీ కవిత దృష్టికి తీసుకురాగా, ఆమె సానుకూలంగా స్పందించి కల్యాణ మండపానికి రూ. 50 లక్షలు, గోదాం నిర్మాణానికి రూ. 10 లక్షలు, యాదవ, గౌడ సంఘ్భవనాల నిర్మాణానికి రూ. 5 లక్షల చొప్పున, యూత్ సంఘ్భవనానికి, రేణుక ఎల్లమ్మ దేవాలయ నిర్మాణానికి, ఈత వనం పెంచడానికి, గుడేటి కాపు సంఘ భవన నిర్మాణాలకు అవసరమైన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ అడగకముందే వరాలిచ్చే దేవుడు సీఎం కేసీఆర్ అని ఆయన కొనియాడారు. పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల మంజూరులో కోరుట్ల నియోజకవర్గం ముందంజలో ఉందని, సీఎం కేసిఆర్, ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ లోకబాపురెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, సబ్‌కలెక్టర్ గౌతమ్ పోత్రూ, మెట్‌పల్లి, కోరుట్ల మున్పిపల్ చైర్మన్లు ఉమారాణి, వేణు, ఏఎంసి చైర్మన్ బాల్క సురేష్, జడ్పీటీసీ విమల సాయిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.