తెలంగాణ

జనసంద్రాన్ని తలపించిన పంచవటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాల్‌కల్, ఏప్రిల్ 16: ఉత్తరాదిన అత్యంత పవిత్రంగా గంగానదికి నిర్వహించే కుంభమేళాను తలపించే విధంగా మంజీర నదికి నిర్వహిస్తున్న కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. పంచవటి క్షేత్రం ఆశ్రమ పీఠాధిపతి కాశీనాథ్ బాబా ఆధ్వర్యంలో కుంభమేళ కార్యక్రమాన్ని 12 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాలనుంచి తరలివచ్చిన భక్తులతో పంచవటి, మంజీరా తీరం జనసంద్రాన్ని తలపించాయి. దేవతలు కొలువుదీరిన ఆలయాల మొదలు, మంజీరా నదివరకు భక్తుల రాకపోలతో నిండిపోయింది. కుంభమేళాకు తరలివచ్చిన భక్తులు పంచటికి కొద్ది దూరంలో వాహనాలు ఆపుకుని అక్కడినుంచి మంజీరా నదివరకు కాలినడకన చేరుకుని పుణ్యస్నానాలుచేసి పునీతులయ్యారు. గంగామాతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నాచితకా, ముసలిముతక, ఆడమగ అన్న తేడా లేకుండా మంజీరానదిలో పుణ్యస్నానాలు దేవతా మూర్తులకు పూజలుచేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ప్రవచనాలు శ్రద్ధగా ఆలకించారు. గరుడ గంగ మంజీరా కుంభమేళాలో మండలంలోని రాఘవపూర్-చాల్కీ గ్రామశివారులోగల పంచవటి క్షేత్రంలో మూడవ రోజు గురుడ గంగ మంజీరా కుంభమేళాకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మంజీరానదిలో పుణ్యస్నానాలుచేసి పంచవటిలోని వివిధ ఆలయాల్లో పూజలుచేస్తున్నారు. ఆలయ ప్రాంతం భజన, కీర్తనలు, సాధువుల సందడితో నిండిపోయింది. సోమవారం బీదర్ జిల్లా భాల్కీ తాలుకా హిరేమఠ్ పీఠాధిపతి బస్వలింగ పట్టెదేవరు కుంభమేళాకు హాజరై బసవేశ్వర జీవిత చరిత్రను భక్తులకు వివరించారు. భక్తులు ఆయన ప్రవనచనాలు ఎంతో ఆసక్తిగా ఆలకించారు. అనంతరం భక్తుల సందేహాలను నివృత్తిచేశారు. ఝరాసంగం మండలం కొల్లూర్ గ్రామానికి చెందిన భజన మండలి సభ్యులు భజనా, కీర్తన తదితర భక్తి కార్యక్రమాలను నిర్వహించారు. కుంభమేళాకు తరలివచ్చిన భక్తులకు స్థానికంగా తాగునీరు, తీర్థప్రసాదాలు, భోజన తదితరాల్లో ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. కుంభమేళాలో బజరంగ్‌దళ్, బీజేవైఎం, వీహెచ్‌పీ ఇతర యువజన సంఘాల సభ్యులు తమ సేవలను అందించారు. భక్తులకు ఆలయ, మంజీరా తీర ప్రాంతం, అన్నదాన స్థలాలవద్ద తమసేవలు అందించారు. కుంభమేళాలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలలనుంచే కాకుండా కర్ణాటక, మహారాష్టల్రకు చెందిన వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. వారికి స్థానికంగా ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.