తెలంగాణ

టెక్నాలజీలో తెలంగాణ పోలీస్ మరో ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: సాంకేతిక ఆధారిత సేవలతో పోలీస్ శాఖను పరుగులు పెట్టిస్తున్న డిజిపి ఎం.మహేందర్ రెడ్డి ‘కాప్-కనెక్ట్’ పేరుతో తెలంగాణ పోలీస్ వాట్సప్‌ను ఆవిష్కరించారు. ఈ వాట్సప్ ఏర్పాటు కావడం పోలీసు శాఖలోనే విప్లవాత్మక మార్పుగా ఆయన అభివర్ణించారు. ఇప్పటికే హైడ్ కాప్, టిఎస్ కాప్, హవాక్, ఈ-పెట్టీ యాప్ వంటి పలు యాప్ ఆధారిత సేవలను శాఖలో అందుబాటులోకి తెచ్చిన డిజిపి వాట్సప్ ప్రారంభంతో మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. సోమవారం డిజిపి తన కార్యాలయంలోని సమావేశ మందిరంలో కాప్ కనెక్ట్ పోలీస్ వాట్సప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ డేటాబేస్‌లో నమోదై ఉన్న డిజిపి నెంబర్ నుంచి కింది స్థాయ వరకు ఉన్న అందరి మొబైల్ నెంబర్లకు ఈ వాట్సప్ కనెక్ట్ అయి ఉంటుందని చెప్పారు. ఒకే నెట్‌వర్క్ కిందకు దాదాపు 63 వేల మంది వస్తారని చెప్పారు. శాఖాపరమైన అంతర్గత సమాచారం ఇచ్చి పుచ్చుకోవాలన్నా, చాలా సులభంగా ఉంటుందని తెలిపారు. ఈ వాట్సప్ సర్వర్ తమ వద్దే ఉంటుందని, పూర్తిగా నూటికి నూరు శాతం సురక్షితం, భద్రతతో కూడినదని డిజిపి భరోసా ఇచ్చారు. అయితే కిందిస్ధాయిలో గానీ, లేదే మరెవరైనా దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు డిజిపి సమాధానం చెబుతూ పోలీస్ శాఖలో మిగిలిన శాఖల మాదిరిగా కాకుండా కాండక్ట్ రూల్స్ ఉంటాయని, ప్రత్యేకించి ఉన్న రెండు చట్టాల ఆదేశానుసారం నడుచుకోవాల్సి ఉంటుందని అన్నారు. అయితే ఈ సౌకర్యం దుర్వినియోగం కాదనే భావిస్తున్నానని చెప్పారు. కేవలం డేటాబేస్‌లో ఉన్న నెంబర్లకు తప్ప మిగిలిన వారికి ఈ వాట్సప్ అందుబాటులో ఉండదని అన్నారు. మామూలుగా సాధారణ వాట్సప్‌లో 256 నెంబర్లకు మాత్రమే పరిమితం అవుతుందని, తాము తయారు చేసిన వాట్సప్ రెగ్యులర్ వాట్సప్ ఫీచర్లనే కలిగి ఉంటుందని, కానీ పోలీసు శాఖలోని 63వేల మందిని చేర్చుకునే విధంగా ఈ వాట్సప్ తయారు చేశామని చెప్పారు. దీనిలో ఉన్న వారెవరైనా ఎన్ని గ్రూపులైనా ఏర్పాటు చేసుకునే సౌకర్యం ఉందని, వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించుకోవచ్చని, చాటింగ్, గ్రూప్ చాటింగ్, ఫోటోలు, టెక్స్‌ట్ మెసేజ్‌లు కూడా పంపించవచ్చని చెప్పారు. ప్రజలకు పారదర్శక పాలన, నేర, అవినీతి రహిత తెలంగాణ రాష్ట్రం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ వాట్సప్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. అంతర్గత సమాచారాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేందుకు గాను వాట్సప్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేయించామని డిజిపి వివరించారు. పోలీస్ వాట్సప్‌లో ఉన్న వారంతా బాధ్యతాయుతంగా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, ఆశించిన ప్రయోజనం నెరవేరే విధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో టెక్నికల్ సర్వీసెస్ అదనపు డిజి రవిగుప్తా, శాంతిభద్రతల అదనపు డిజి జితేందర్, సిఐడి అదనపు డిజిపి గోవింద్ సింగ్, మరో అదనపు డిజి సౌమ్యా మిశ్రా పాల్గొన్నారు.