తెలంగాణ

ఇక ప్రాంతీయ భాషల్లోనూ సీటెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ సీబీఎస్‌ఈ ద్వారా ప్రతి ఏటా నిర్వహించే సీటెట్ (సెంట్రల్ టీచర్సు ఎలిజిబిలిటీ టెస్టు)ను ఇక మీదట ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నారు. ఈ మేరకు సీబీఎస్‌ఈ అధ్యయనం చేసింది. ఈ ఏడాది సీటెట్‌ను 20 భారతీయ భాషల్లో నిర్వహిస్తారు. ఇంగ్లీషు, హిందీ, అస్సామీ, బంగ్లా, గుజరాతీ, కన్నడ, ఖసి, మళయాలం, మణిపురి, మరాఠీ, మిజో, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, తమిళం, తెలుగు, టిబిటెన్, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు.
సిటెట్ నుండి 17 భాషలను తొలగించడంపై దేశవ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత రావడంతో సీటెట్ ప్రణాళికను సీబీఎస్‌ఈ పునరాలోచన చేసింది. కాగా ఈ ఏడాది సీటెట్‌ను సెప్టెంబర్ 16న నిర్వహించనున్నారు. ఇందుకు ఆన్‌లైన్‌లో జూన్ 22 నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు.
అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ పీహెచ్‌డీ దరఖాస్తు గడువు పెంపు
అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ పీహెచ్‌డీ ప్రవేశ దరఖాస్తుల సమర్పణ గడువును ఈ నెల 26వ తేదీ వరకూ పొడిగించారు. అయితే ఇందుకు 500 రూపాయిల అదనపు రుసుం చెల్లించాలని వర్శిటీ ఒక ప్రకటనలో పేర్కొంది.
భవనాల ప్రారంభం
మారేడుపల్లిలోని న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం ఉదయం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే జీ సాయన్న, బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ తదితరులు పాల్గొన్నారు. రాఘవలక్ష్మీ దేవి స్మారకంగా భవనం నిర్మించడానికి ఆర్ శంకరరావు ముందుకు వచ్చారని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శంకరరావును సత్కరించారు.
ఇఫ్లూలో ఆంగ్లంపై కోర్సులు
ఆంగ్లం- విదేశీ భాషల విశ్వవిద్యాలయంలో ఆంగ్లంపై రెండు వారాల స్వల్పకాలిక కోర్సులను ప్రారంభించనున్నారు. ఈ కోర్సులు జూన్ 20 నుండి జూలై 2 వరకూ కొనసాగుతాయి. ఆంగ్లంలో ప్రావీణ్యం గడించడానికి , ఎలా వినాలి? ఎలా రాయాలి ? ఎలా మాట్లాడాలి ? ఎలా చదవాలి అనే అంశాలతో పాటు ఆంగ్లంపై పట్టుసాధించేందుకు ఉపయోగపడుతుందని యూనివర్శిటీ ఒక ప్రకటనలో పేర్కొంది.
కనీసం 10వ తరగతి చదివిన వారు ఈ కోర్సులో చేరవచ్చని, ఈ కోర్సు మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకూ ప్రతి రోజు సాయంత్రం నిర్వహిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇతర వివరాలకు 040-27689431లో సంప్రదించాలని సూచించారు.

కాంట్రాక్ట్ ఉద్యోగుల గడువు హెచ్చింపు
హైదరాబాద్, జూన్ 18: తెలంగాణ వైద్య విధాన పరిషత్ అధీనంలో పనిచేస్తున్న వివిధ క్యాటగిరీలకు చెందిన 1048 మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల గడువు పొడిగించారు. 2018 ఏప్రిల్ 1 నుండి 2019 మార్చి 31 వరకు ఈ ఉద్యోగులు పనిచేసేందుకు వీలు కల్పించారు. గడువు పెంచిన వారిలో 216 మంది డాక్టర్లు (సీఏఎస్, డీఏఎస్), 236 మంది నర్సులు, 306 మంది పారామెడికల్, 43 మంది మినిస్టీరియల్, 192 మంది క్లాస్ ఫోర్ సిబ్బందితో పాటు 32 మంది డ్రైవర్లు ఉన్నారు.