తెలంగాణ

ఖజకిస్తాన్‌కు సింగరేణి ప్రతినిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: రానున్న కాలంలో మైనింగ్‌లో (గనుల్లో) ఆధునిక యంత్రాల వినియోగంపై ఖజకిస్తాన్ (రష్యా)లో ఏర్పాటు చేసిన 25వ ప్రపంచ మైనింగ్ కాంగ్రెస్‌లో పాల్గొనడానికి సింగరేణి యాజమాన్యానికి ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో ఈనెల 22వ తేదీ వరకు ఖజకిస్తాన్‌లో జరుగు ఫ్లీనరీకి సింగరేణి నుంచి సిఎండి శ్రీ్ధర్‌తో పాటు డైరెక్టర్ చంద్రశేఖర్, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కెవి రమణమూర్తి హాజరవుతున్నారు. ఈ ఫ్లీనరీకి దాదాపు 50 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని, ఇందులో 2000 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. సింగరేణితో పాటు కోలిండియా, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, ఎన్‌ఎమ్‌డిసి తో పాటు ఇతర మైనింగ్ సంస్థల నుంచి 50 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. లోతైన భూగర్భ గనుల్లో అననుకూల బొగ్గు పొరలు ఉన్న చోట అత్యాధునిక లాంగ్‌వాల్ గేట్‌రోడ్డు సపోర్టు అంశాలపై చర్చలు జరగనున్నాయి. బొగ్గు ద్వారా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి గల అవకాశాలు, బొగ్గు నుంచి హైడ్రోజన్ ఉత్పాదన, భవిష్యత్తులో ఆటోమొబైల్ ఇంధనంగా, బొగ్గు ఖనిజ ద్రవీకరణ పదార్థ వినియోగంపై అవకాశాలను చర్చంచనున్నారు. ఖజకిస్తాన్‌లో లభిస్తున్న రాగి, బంగారం, బొగ్గు గనుల్లో మైనింగ్ చేయడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయనున్నారు. అలాగే ఖనిజ రంగం మనుగడకు నూతన శాస్ర్తియ, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, 2030 నాటికి చేరుకోనున్న 8 బిలియన్ల ప్రపంచ జనానా కావాల్సిన ఖనిజాలను అందుబాటులో ఉంచడానికి సన్నాహాలు చేపట్టడం జరుగుతోంది. డిజటలైజేషన్ 4 జీన్సు వంటి కీలకాంశాలపై ప్రపంచ మైనింగ్ మేధావులు తమ విశే్లషణలు సమర్పిస్తారు. ప్రపంచ మైనింగ్ కాంగ్రెస్‌ను ప్రతి 2 లేదా మూడేళ్ళకు ఏదో దేశంలో జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఇటు వంటి ఫ్లీనరీలు 1958 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు.. భారత్‌లో 1984, 2004 లో చేపట్టడం జరిగింది. గనుల్లో ఆధునిక యంత్రాల పనితీరుపై ప్రదర్శన చేపట్టనున్నారు. నేటి బొగ్గు రంగం ఏదుర్కొంటున్న సవాళ్ళ, పరిష్కార మార్గాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ వినియోగంతో తక్కువ ఖర్చుతో ఉత్పిత్తి వంటి ఉపయోగకర విషయాలపై ఈసదస్సులో చర్చంచనున్నారు. 2021లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో నిర్వహించడానకి అక్కడి ప్రభుత్వం ముందుకు వచ్చింది.
సీఎండీకి ‘అవుట్ స్టాండింగ్ లీడర్‌షిప్ అవార్డు’
ప్రముఖ ఆర్థికాంశాల అధ్యయన సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ వారు ఈ యేడాది సింగరేణి సంస్థ సిఎండి శ్రీ్ధర్‌కు అవుట్ స్టాండింగ్ లీడర్‌షిప్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును దుబాయ్‌లో ఈనెల 28 వ తేదీన బహుకరిస్తున్నట్లు తెలిపారు. దుబాయ్‌లో అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ ఎకనామిక్ సమిట్ సదస్సును ఆ సంస్థ ఏర్పాటు చేసింది. ప్రతి యేడాది వివిధ రంగాల్లో ప్రావీణ్యం పొందిన వ్యక్తులను ఎంపిక చేస్తారు. ఈ యేడాది సింగరేణి సిఎండి శ్రీ్ధర్‌ను ఎంపిక చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది.