తెలంగాణ

ప్రభవిస్తున్న బాసర ట్రిపుల్ ఐటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బాసర ట్రిపుల్ ఐటి ఆవిర్భవించింది. బోధన- అభ్యసన రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంతో పాటు అధ్యాపకులకు శిక్షణ, విద్యార్థులకు సంపూర్ణ సౌకర్యాలను కల్పించడంలో బాసర ట్రిపుల్ ఐటి అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుందని వైస్ ఛాన్సలర్ ఇన్‌చార్జి డాక్టర్ ఎ అశోక్ పేర్కొన్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రపంచ ప్రమాణాలతో సరితూగే రీతిలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రెసిడెన్షియల్ ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదన 2008లో రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ రూపం దాల్చిందని, అప్పటి నుండి ఉమ్మడి రాష్ట్రంలో బాసర, నూజివీడు, ఆర్‌కే వ్యాలీల్లో మూడు ట్రిపుల్ ఐటిల్లో అడ్మిషన్లు చేస్తున్నారని, తెలంగాణ పరిధిలో బాసర ట్రిపుల్ ఐటి 272 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత భవనాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 6వేల మంది విద్యార్థులు, 250 మంది బోధన, బోధనేతర సిబ్బంది, 140 ఐసిటి తరగతి గదులు, లక్ష పుస్తకాలతో కూడిన లైబ్రరీ, బ్యాంకు, ఎటిఎం కేంద్రం, షాపింగ్ కాంప్లెక్స్, పోస్ట్ఫాసు, 30 పడకల హెల్త్ కేంద్రం, విద్యార్థుల యాక్టివిటీ సెంటర్, గేమ్స్ సెంటర్‌లను ఏర్పాటు చేశారు. ఆరు వేల మందికి బస ఏర్పాటు చేసేందుకు ఆరు హాస్టల్ భవనాలు ఏర్పాటు చేశామని, అలాగే రెండు వేల మంది విద్యార్థులకు భోజన సదుపాయానికి మూడు మెస్‌లు ఉన్నాయని అన్నారు. 90 మిలియన్ లీటర్ల సామర్ధ్యం ఉన్న సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను 27 ఎకరాల్లో నిర్మించామని చెప్పారు. ఆరు ఆర్‌ఓ ప్లాంట్లు అందుబాటులోకి తెచ్చామని అశోక్ పేర్కొన్నారు.
పదో తరగతి పూర్తి చేసిన వారికి ఆరేళ్ల ఇంజనీరింగ్ కోర్సులో అడ్మిషదన్లు కల్పిస్తున్నారు. ప్రస్తుతం బాసరలో కెమికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జీ, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. వీటితో పాటు పీజీ కోర్సులను సైతం ఆఫర్ చేస్తున్నారు.
ప్రాంగణ నియామకాలు
ప్రాంగణ నియామకాల్లో బాసర ఐఐటి రికార్డు సృష్టించిందని డాక్టర్ అశోక్ పేర్కొన్నారు. 2013-14లో 57 కంపెనీలు, 14-15లో 54, 15-16లో 48, 16-17లో 50, 2017-18లో 64 కంపెనీలు ప్రాంగణ నియామకాల్లో పాల్గొన్నాయని, ప్రతి ఏటా 250 మందికి పైగా నియమితులవుతున్నారని చెప్పారు. తెలంగాణ ఇన్నోవేషన్ , ఇంక్యూబేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని, సేఫ్ ట్రేస్ హబ్ పేరిట తొలి కేంద్రం మొదలైందని వివరించారు. విర్చ్యువల్ రీయాలిటీ, బిగ్ డాటా అనలైటిక్స్, బ్లాక్ చైన్ అనాలసిస్, ఇతర టెక్నాలజీలను కూడా క్యాంపస్‌లో వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.
యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు గత కొద్దికాలంలో అనేక విజయాలు సాధించారని, గేట్-2017లో 1, 6,8,12 ర్యాంకులు తమ విద్యార్థులకే దక్కాయని, డిఆర్‌డిఓ, ఇస్రో, బార్క్ తదితర కేంద్ర సంస్థల్లో అనేక మందికి ఉద్యోగాలు వచ్చాయని, ప్రభుత్వ శాఖల్లో 210 మంది ఇంజనీర్లుగా నియమితులయ్యారని, 35 మంది ట్రాన్స్‌కో, జెన్‌కోల్లో నియమితులయ్యారని డాక్టర్ అశోక్ వివరించారు. ఆర్‌జియుకేటీ ఇంటెల్ కాంపిటీషన్‌లో మూడోస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
ఎన్‌సిఆర్‌ఐ, సిఐటిడి తదితర సంస్థలతో చర్చించి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని, ట్రైనింగ్ , ప్లేస్‌మెంట్‌లో ముందంజలో ఉన్నామని చెప్పారు.
క్యాంపస్‌లో బయోమెట్రిక్ అటెండెన్స్ , ఎంప్లాయిస్ లీవ్ మేనేజిమెంట్ సిస్టం, ఫీజు మేనేజిమెంట్ సిస్టం, గ్రివెన్స్ రిడ్రెసెల్ సెల్, కెరీర్ రిక్రూట్‌మెంట్ సెల్, స్టూడెంట్ ఎంప్లాయి ఇన్ఫర్మేషన్ ఇ ప్రొఫైల్ సిస్టం అమలుచేస్తున్నామని, యూనివర్శిటీ వెబ్‌సైట్‌ను కూడా ఆధునికీకరిస్తున్నామని, ఆన్‌లైన్‌లోనే స్నాతకోత్సవ వివరాలను అప్ డేట్ చేస్తున్నామని, డిజిటల్ నోటీసులు సిస్టం అమలుచేస్తున్నామని పేర్కొన్నారు. మిగిలిన అన్ని విద్యాసంస్థలకూ నమూనాగా పనిచేస్తోందని చెప్పారు. ఇ కార్డు మేనేజిమెంట్ సిస్టం, సర్వే మేనేజిమెంట్ సిస్టం, అల్యుమ్ని పోర్టల్, టెక్ ఫెస్టు సర్వీసెస్, సెక్యూరిటీ గేట్ సిస్టం, సర్ట్ఫికేట్స్- డాక్యుమెంట్ మేనేజిమెంట్ సిస్టం, హ్యుమన్ రిసోర్స్ మేనేజిమెంట్ సిస్టం, ఇ ఫైల్ మేనేజిమెంట్ సిస్టం అమలులోకి తెచ్చారు.