తెలంగాణ

రాష్ట్రంలోనూ అధికారం బీజేపీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం నాడు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంపాదకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమైందని, ప్రజలు విసిగెత్తిపోయారని అయినా కేసీఆర్ ఇంకా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి రావడానికి సరపడా మెజార్టీతో పాటు రాష్ట్రంలో 15 ఎంపీ స్థానాలను గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు పార్టీ సర్వ సన్నద్ధం అవుతోందని చెప్పారు. వచ్చే నెల 12న అమిత్‌షా రాష్ట్రానికి వస్తారని ఈ సందర్భంగా పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని, బూత్ స్థాయి నాయకులు మొదలు రాష్ట్ర స్థాయి నేతల వరకూ ఆయన వేర్వేరుగా భేటీ అవుతారని, సామాన్య కార్యకర్తల అభిప్రాయాలను కూడా వింటారని తెలిపారు. బీజేపీ జనచైతన్య యాత్ర ఈ నెల 23న మొదలవుతుందని, బషీర్‌బాగ్ అమ్మవారి దేవస్థానంలో పూజలు అనంతరం యాదాద్రి దర్శించి, సాయంత్రం 3 గంటలకు భువనగిరి సభతో ఈయాత్ర మొదలవుతుందని, జూలై 14 వరకూ ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పారు.
ఈ యాత్ర సందర్భంగా బీజేపీ జనరంజక పాలనపైనా, టీఆర్‌ఎస్ ప్రగల్బాలను, కాంగ్రెస్ అవినీతి తీరును, కర్నాటకలో రాజకీయాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారాయని, టీఆర్‌ఎస్ తీరును చీత్కరించుకుంటున్నారని అన్నారు. ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిందని, నిరుద్యోగ సమస్య, రెండు బెడ్‌రూమ్‌ల ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ అంతా మిథ్య అని అన్నారు. వీటిని పరిష్కరించలేకపోయిన ప్రభుత్వం కొత్త అంశాలను అజెండాగా ముందుకు తీసుకువస్తోందని ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ శాఖ రానున్న రోజుల్లో మరింత చురుకుగా పనిచేస్తుందని అన్నారు. కేంద్రప్రభుత్వం ప్రతి గ్రామానికీ నిధులు ఇస్తోందని, ఇటీవల లెక్కలు వేస్తే కనీసం కోటి రూపాయిలు చొప్పున గ్రామాలకు వచ్చిందని, అయితే కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు బకాయిలను తీసేసీ మిగిలిన నిధులు ఇస్తున్నారని పేర్కొన్నారు. తాము ఐదు పథకాలను ఎంపిక చేసి వాటిని అధ్యయనం చేశామని, వాటి ఫలితాలు దేశ ప్రజలకు అందుతున్నాయని చెప్పారు. దళితుడ్ని సీఎంను చేస్తానని కేసీఆర్ చెప్పారని, ఆయనకు దళితుల గురించి మాట్లాడే హక్కు లేదని పేర్కొన్నారు. బీజేపీ దళిత పక్షపాతిగా ఉందని అన్నారు. రాష్ట్రంలో ఉద్యమం సందర్భంగా అశువులు బాసిన అమరవీరుల కుటుంబాలు బాధల్లో ఉన్నారని, వారిని ఇంత వరకూ ప్రభుత్వం ఆదుకోలేదని చెప్పారు. కేసీఆర్ ఇప్పటికీ ప్రజలను మభ్యపెడుతున్నారని కేంద్రం అన్ని విధాలా రాష్ట్రాన్ని ఆదుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాసనమండలి పక్ష నేత ఎన్ రామచందర్‌రావు, అధికార ప్రతినిధులు, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.
పోస్టర్ విడుదల
ఈ నెల 23 నుండి జరిగే బీజేపీ జనచైతన్య యాత్ర పోస్టర్‌ను ఎన్ రామచందర్‌రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ధర్మారెడ్డి, మనోహర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.