తెలంగాణ

పాఠశాలల బంద్ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: ఏబీవీపీ రాష్టవ్య్రాప్త పాఠశాలల బంద్ విజయవంతం అయ్యిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా 35వేల స్కూళ్లకు పైగా బంద్‌లో పాల్గొన్నాయని దీనికి సహకరించిన తల్లిదండ్రులకు, పాఠశాలల యాజమాన్యాలకు, విద్యార్థులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో నిరసన తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో బంద్ కావడం ప్రభుత్వంపై విద్యార్థులు, తల్లిదండ్రుల అసమ్మతికి ఆక్రోశానికీ ఫలితమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న పాఠశాలలు కూడా బంద్‌లో పాల్గొని మద్దతు తెలిపాయని, గ్రామీణ ప్రాంతంలోని తక్కువ ఫీజులతో చిన్న పాఠశాలలకు ఏబీవీపీ మద్దతు ఉంటుందని కార్పోరేట్ సంస్థలు నర్సరీకి లక్షలకు పైగా ఫీజులు వసూలు చేస్తుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా మెద్ద నిద్ర పోతోందా అని అన్నారు. రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం తేకుండా కాలయాపన చేస్తూ ప్రైవేటు , కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వంలోని పెద్దలు అమ్ముడుపోయి పేద మధ్యతరగతి వారిని దోచుకుంటున్నారని ఆరోపించారు.