తెలంగాణ

రైతుబంధు బీమాకు రూ. 500 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: తెలంగాణ రైతులకు జీవిత బీమా సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం గురువారం 500 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రైతుబంధు బీమా కింద ఒక్కో రైతుకు ఐదులక్షల రూపాయల బీమా కల్పిస్తామని ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఒక్కో రైతు పేరుతో 2271.50 రూపాయలు ప్రీమియంగా ఎల్‌ఐసీకి చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎల్‌ఐసీ సంస్థతో ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలోని రైతుల వివరాలను 2018 ఆగస్టు 15 లోగా పంపించాలని ప్రభుత్వం జిల్లాల్లోని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా గ్రామాల్లోని వ్యవసాయ విస్తరణ అధికారులు రైతుల పేర్లు, వారి పేరుతో ఉన్న భూమి విస్తీర్ణం తదితర వివరాలను సేకరిస్తున్నారు. ఈ వివరాలు హైదరాబాద్‌లోని వ్యవసాయ శాఖ కమిషనర్‌కు అందిన తర్వాత ఎంత మంది రైతుల పేర్లతో బీమా ప్రీమియం చెల్లించాలో స్పష్టమవుతుంది. రాష్ట్రంలో 58 లక్షల మంది రైతులు ఉన్నారని, వీరి పేర్లతో 142 లక్షల ఎకరాల భూమి ఉందని ప్రభుత్వం ఇటీవల చేసిన సర్వేలో తేలింది. 18 సంవత్సరాలపైబడి, 59 సంవత్సరాల వరకు సేద్యం చేస్తున్న రైతులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. ఎంత మంది రైతుల పేర్లతో బీమా చేయాల్సి వస్తుందో ఆగస్టు 15 తర్వాత తేలుతుంది. ఈలోగా ఎల్‌ఐసీతో పరిపాలనా పరంగా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత అంచనాల మేరకు తొలుత 500 కోట్ల రూపాయలు విడుదల చేశారు. వ్వయసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి పేరుతో గురువారం ఈ మేరకు జీఓ (ఆర్‌టీ నెంబర్ 400) జారీ అయింది. అవసరమైతే మరిన్ని నిధులు ఈ పథకం కోసం విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.