తెలంగాణ

విద్యుత్ కొనుగోలుకు స్వల్పకాల టెండర్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: తెలంగాణలో విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ కొనుగోలుకు పిలిచిన టెండర్లు గురువారంతో ముగిశాయి. మరో రెండు రోజుల్లో టెండర్ బాక్సులను తెరవనున్నారు. విద్యుత్ కొనుగోలు వ్యవహారం అంతా తెలంగాణ విద్యుత్ కోఆర్డినేషన్ కమిటి పర్యవేక్షణలో ఒప్పందాలు జరగనున్నాయి. విద్యుత్ కొనుగోలు ప్రైవేట్ రంగం నుంచి కాని లేక పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దాదాపు 1000 మెగావాట్ల విద్యుత్‌ను కొనడానికి స్వల్పకాలిక పద్దతిలో విద్యుత్ ఉత్పత్తి దారులతో ఒప్పందం చేసుకోవడానకి ప్రభుత్వం టెండర్లుకు ఆహానించింది. ఈ వేలం మద్దతిలో టెండర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం సూచించింది.
వచ్చేనెల 16 వతేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు రోజూ 9 గంటలు విద్యుత్‌ను సరఫరా చేయాలన్న నిబంధనను పాటించాలని ప్రభుత్వం నిక్కచ్చిగా స్పష్టం చేసింది. రోజూ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్‌ను పంపిణీ చేయాల్సి ఉంటుంది. అనుభవం ఉన్న విద్యుత్ ఉత్పత్తి దారులు మాత్రమే టెండర్లలో పాల్గొనాలని సూచించింది. ఈ వేలం పాల్గొనే వారు రూ 50 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీతో పూచీ పత్రాలను దాఖలు చేయాలన్న నిబంధనను పాటించాలని ప్రభుత్వం పేర్కొంది. వర్షాకాలంలో రైతాంగం ఎక్కువగా విద్యుత్ పంపుసెట్లను వినియోగిస్తారని, అలాగే 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలి కనుక విద్యుత్ కొనుగోలు అనివార్యం అవుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ల నుంచి విద్యుత్ ఎక్కువగా సరఫరా అవుతున్నా అవసరాలకు సరిపోవడంలేదు. భారీ నీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఘననీయంగా తగ్గినందున హైడల్ విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. నీటి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తే 2085 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. నైరుతి రుతుపవనాల కోసం ఎదురుచూస్తున్నామని విద్యుత్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నుంచి కొంత విద్యుత్‌ను దిగుమతి చేసుకున్నప్పటికీ అవసరాలకు సరిపడడంలేదు. రానున్న ఖరీఫ్ (యాసంగి)లో ఎత్తిపోతలు నీటి ప్రాజెక్టులకు విద్యుత్ సరఫరాను చేయాల్సివుంది. ప్రస్తుతం ఉత్తర (వరంగల్) దక్షణ ( హైదరాబాద్) తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి.