తెలంగాణ

ఇంటర్ విద్యార్థులకు నీట్, జెఈఈ శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: రానున్న నీట్, జెఈఈ పరీక్షలకు తెలంగాణ గురుకుల, మోడల్‌స్కూళ్ల, కేజీబీవీ విద్యార్థులే అధికంగా సీట్లు కైవసం చేసుకునే విధంగా ఇంటర్ ఫస్టియర్ నుండే వారికి కోచింగ్ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ప్రైవేటు విద్యాసంస్థల కంటే గురుకుల విద్యార్ధులే మంచి ఫలితాలను సాధించరని, అయితే మార్కులు సాధించడమేగాక, మంచి ప్రమాణాలు ఉన్న విద్యార్ధులను రూపొందించే విధంగా విద్యాబోధన, శిక్షణ ఉండాలని సూచించారు. తెలంగాణలో చదివిన విద్యార్థి ఎవరితోనైనా పోటీ పడగలరనే నమ్మకాన్ని కలిగించాలని అన్నారు. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో చదివే ఆడపిల్లల్లో రక్తహీనత లేకుండే ఉండేందుకు ప్రత్యేక పోషకాహారాన్ని ఇవ్వాలని, వారి ఆరోగ్య పరిరక్షణ కోసం గైనకాలజీ డాక్టర్లతో గురుకులాల్లో అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని సంక్షేమ గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు , హాస్టళ్లలో ఒకే రకమైన మెనూ, వసతులు, పాఠ్యాంశాలు, అకడమిక్ క్యాలండేర్, యూనిఫారాలు, హెల్త్ అండ్ హైజీన్ కిట్ల పంపిణీ ఉండేలా సమన్వయంతో పనిచేయాలని అన్నారు. విద్యాశాఖ , గిరిజన, సంక్షేమ, మైనార్టీ, బీసీ గురుకులాల కార్యదర్శులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
టీచర్ల బదిలీల కేసులో తీర్పు రిజర్వు
హైదరాబాద్, జూన్ 21: పంచాయతీరాజ్ పరిధిలోని టీచర్లను బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడదని కొంతమంది టీచర్లు దాఖలు చేసిన పిటీషన్లపై తన తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ జె ఉమాదేవిలతో కూడిన డివిజన్ బెంచ్ పిటీషన్లను విచారించిన అనంతరం తీర్పును రిజర్వు చేసింది.