తెలంగాణ

ఇంటర్ బోర్డుకు స్కోచ్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: టెక్నాలజీ వినియోగంలో ఎంతో ముందంజలో ఉంటూ ఐటీని వినియోగించుకుంటూ అకడమిక్ పరిపాలనా నిర్వహణలో సమూల మార్పులను తీసుకువచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యామండలి కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ గురువారం నాడు స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డును పొందారు. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక సమ్మేళనంలో ఈ అవార్డు అందుకున్నట్టు డాక్టర్ అశోక్ తెలిపారు. టెక్నాలజీని అన్ని దశల్లో ఉపయోగించుకుంటూ కాలేజీల్లో అడ్మిషన్లు, ప్రవేశాలు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, పరీక్ష ఫలితాల వెల్లడిని సులభతరం వేగవంతం చేశామని అశోక్ చెప్పారు. అకడమిక్ , పరీక్షల నిర్వహణలో కీలకమైన వౌలిక మార్పులను తీసుకుని వచ్చామని, ఆన్‌లైన్ లెర్నింగ్‌లో భాగంగా పది లక్షల మంది విద్యార్థ్ధులకు డిస్క్‌ద్వారా డిజిటల్ స్టడీ కిట్‌లను ఇచ్చామని అన్నారు. అలాగే పరీక్ష కేంద్రాల లోకేషన్‌కు యాప్ ప్రవేశపెట్టామని, జవాబుపత్రాల మూల్యాంకనం ఆన్‌లైన్ ద్వారా చేపట్టడం జరిగిందని చెప్పారు.
అర్హత పరీక్ష వాయిదా
అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ అర్హత పరీక్షను ఈ నెల 22 వ తేదీ నుండి జూలై 22కి వాయిదా వేశారు. అర్హత ఉన్న అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ గడువును జూలై 16 వరకూ పొడిగించామని వర్శిటీ ఒక ప్రకటనలో తెలిపింది.