తెలంగాణ

76వేల ఎకరాలకు నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: ఈ ఏడాది మిడ్ మానేరు డ్యామ్‌లోకి 25 టిఎంసిల నీరు నింపి 76 వేల ఎకరాలకు నీరందించనున్నట్టు నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులపై గురువారం సచివాలయం నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ఏడాది మిడ్ మానేరులోకి 5 టిఎంసీల నీరు మాత్రమే నింపగలిగామన్నారు. ఈ ఏడాది 25 టిఎంసీల నీరు నింపనుండటంతో దానికి అనుగుణంగా ప్రాజెక్టు గేట్లను సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు.
లింక్ కెనాల్ పనులు లక్ష్యం మేరకు జరగడం లేదని అధికారులు మంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ నుంచే కాంట్రాక్టర్లతో మంత్రి నేరుగా ఫోన్లో మాట్లాడి వేగవంతంగా పనులు జరుగాలని ఆదేశించారు. మిడ్ మానేరు ద్వారా చెరువులను నింపడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. మిడ్ మానేరు పునరావాస చర్యల కోసం 33 కోట్ల నిధులు కేటాయించినట్టు వివరించారు. పునరావాస చర్యల కింద రోడ్లు, విద్యుత్, పాఠశాలల వంటి వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సిరిసిల్ల కలక్టర్ కృష్ణ భాస్కర్‌ను మంత్రి ఆదేశించారు. అనంతగిరి రిజర్వాయర్ కోసం ఇంకా 102 ఎకరాల భూ సేకరణ జరుగాల్సి ఉందని మంత్రి గుర్తు చేసారు.
ఆదిలాబాద్ జిల్లాలోని ఛనాకా, కోరాటా బ్యారేజి, కొమురం బీమ్, గొల్లవాగు, నీలవాయి ప్రాజెక్టుల కాలువ పనులు, భూ సేకరణ, పునరావాస సహాయ చర్యల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఛనాకా-కోరాట ప్రాజెక్టులోకి అక్టోబర్ వరకు నీరు నింపి 13 వేల ఎకరాలకు అందిస్తామన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును సందర్శించనున్నట్టు మంత్రి తెలిపారు. కొమురం బీమ్ ప్రాజెక్టు కింద గత ఏడాది 20 వేల ఎకరాలకు నీరు అందించడగా ఈ ఏడాది అదనంగా 5 వేల ఎకరాలకు అందిస్తామన్నారు.