తెలంగాణ

అంగన్‌వాడీల సేవలకు ‘హెల్ప్‌లైన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: అంగన్‌వాడీల ద్వారా సేవల గురించి తెలుసుకునేందుకు, సలహాలు పొందేందుకు హెల్ప్‌లైన్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. హెల్ప్‌లైన్ ఉచిత ఫోన్‌నెంబర్‌గా 155209 ఉంటుంది. ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ హెల్ప్‌లైన్ పనిచేస్తుందని మహిళా, శిశు సంక్షేమ శాఖ గురువారం ప్రకటించింది. జీవీకే-ఈఎంఆర్‌ఐ సంస్థ సహకారంతో హెల్ప్‌లైన్ పనిచేయడం ప్రారంభించింది. అంగన్‌వాడీ సేవలు లబ్దిదారులకు ఏ విధంగా, ఎక్కడ, ఎప్పుడు అందుతున్నాయో హెల్ప్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎక్కడైనా అంగన్‌వాడీ కేంద్రాలు సరిగా పనిచేయకపోతే ఇదే ఫోన్‌నెంబర్‌కు ఫిర్యా దు చేస్తే, ఉన్నతాధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారు. తల్లి, పిల్లల పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, పెరుగుదల సమస్యలు, తల్లిపాలుపట్టడం, పిల్లల అభివృద్ధికి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు ఇస్తారు. ప్రస్తుతం అంగన్‌వాడీల ద్వారా గ్రర్భిణీలు, బాలింతలు ఆరేళ్లలోపు పిల్ల ల పేర్లను అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదు చేసుకుంటారు. గర్భిణీలు, బాలింతలు, ఆరు సంవత్సరాలలోపు పిల్లలకు పౌష్టికాహారం అందించడం, ఐరన్ మాత్రలు అందించడం, రక్తహీనత తగ్గేలా ప్రోత్సహిస్తున్నారు.